Mahesh Babu: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న యానిమల్ సినిమాపై హిందీ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్లుగా రాజమౌళి, మహేష్ బాబు రావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఈవెంట్ లో ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునింది ఏమిటి అంటే.. బాలీవుడ్ హీరోలు అనిల్ కపూర్.. బాబీ డియోల్.. స్టేజిపై మాట్లాడుతూ ఉండగా మధ్యలో అనిల్ కపూర్ మహేష్ బాబుని.. రణబీర్ కపూర్ ని.. డాన్స్ వెయ్యడానికి స్టేజ్ పైకి పిలవడం.


ఇక సిగ్గుపడుతూ స్టేజ్ పైకి వచ్చిన మహేష్ బాబు ఎలాగో ఒకలా.. చెయ్యి పైకి కిందకి అంటూ ఒక చిన్న స్టెప్ వేశాడు. ఆయన వేసింది స్టెప్పు కాకపోయినా.. అది కొంచెం పోకిరి సినిమాలో ధోలే దోలే సాంగ్‌లో ఆయన మూమెంట్ లాగా ఉండడంతో అక్కడున్న మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంబర పడిపోయారు.





ఇక ఆ తరువాత ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి గురించి మాట్లాడుతూ…సందీప్ రెడ్డి  ఎంతో నిజాయితీగా సినిమా తీస్తాడని, ఆ ఎమోషన్స్‌ను చూపిస్తాడని, ఇండియాలో ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అని ప్రశంసించాడు. అంతేకాదు యానిమల్ ట్రైలర్ చూసి వచ్చేసిందని .. ముఖ్యంగా బాబీ డియోల్‌ను టీజర్ లాస్ట్ షాట్‌లో చూసిన తరువాత చేతిలోంచి ఫోన్ కింద పడిపోయిందని చెప్పుకొచ్చారు మహేష్.


ఇక అనిల్ కపూర్ నటన చూస్తే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పిన మహేష్ ఆ తరువాత ఈ సినిమా హీరో రణ్‌బీర్ కపూర్‌ గురించి మాట్లాడుతూ తాను రణబీర్ కి పెద్ద ఫ్యాన్ అని, ఇది వరకే అతడికి ఆ విషయం చెప్పానని, కానీ రణబీర్ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదేమో అని చెప్పుకొచ్చాడు. ఇండియాలో రణ్‌బీర్ కపూర్ ది బెస్ట్ యాక్టర్ అని ప్రశంసించాడు మహేష్ బాబు.


Also Read: IPL 2024 Purse Details: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ, ఏ జట్టు పర్సులో ఎంత ఉందో తెలుసా.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి