NBK 108 Title Kesari నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా టైటిల్ కానీ ఇతర వివరాలు కానీ బయటకు రాకుండా చాలా పగడ్బందీగా వ్యవహరిస్తూ వచ్చింది. సినిమా యూనిట్ అయితే ఈ సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాకి భగవంత్‌లాల్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టుగా ప్రచారం అయితే మొదలైంది. ఐ డోంట్ కేర్ అనేది ట్యాగ్ లైన్ గా ఉండబోతుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో బాలకృష్ణ వయసైన ఒక వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే అనిల్ రావిపూడి ప్రకటించారు. నందమూరి బాలకృష్ణను మునుపెన్నడూ చూడని ఒక రకమైన పాత్రలో తాను చూపిస్తానని కూడా అభిమానులకు హామీ ఇచ్చేశాడు. అయితే తెలంగాణ నేపథ్యంలో ఉన్న ఒక వ్యక్తిగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను చూపించబోతున్నారని తాజాగా తెలుస్తోంది.


 నిజానికి నందమూరి బాలకృష్ణకు సింహ అనే సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయన సినిమాలకు సింహ అనే టైటిల్ ఫిక్స్ చేస్తే ఫ్లాప్ అవడం అటు ఉంచితే హిట్లు సూపర్ హిట్లు అయినవి ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సెంటిమెంట్ గౌరవిస్తూనే హిందీలో సింహాన్ని పిలిచే కేసరి పదాన్ని ఈ సినిమా టైటిల్ కి కలిపినట్లుగా ప్రచారం జరుగుతోంది.


Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!


 ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ భార్య పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా వీరి కుమార్తె పాత్రలో యంగ్ హపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల నటించబోతున్నట్లుగా తెలుస్తోంది బాక్సింగ్ ఛాంపియన్ పాత్రలో కనిపించబోయే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది కానీ సినిమా విడుదలయితే కానీ ఆ విషయం మీద అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK