Anushka Sharma to return to films after 3 years with 2 big projects : బాలీవుడ్‌లో బయోపిక్‌ (Biopic‌) సినిమాలకు ఎక్కువగా ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకు రిలీజైన చాలా బయోపిక్ మూవీలను బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆదరించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న బాలీవుడ్‌ నటి (Bollywood‌ Actress) అనుష్క శర్మ సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుష్క శర్మ ఒక బయోపిక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ జులన్‌ గోస్వామి (Jhulan Goswami) బయోపిక్‌ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. చక్‌దా ఎక్స్‌ప్రెస్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో జులన్‌ గోస్వామిగా అనుష్కశర్మ కనిపించనుంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix‌) ద్వారా రిలీజ్‌ కానున్న ఈ మూవీ టీజర్‌ (Movie teaser‌) ఇటీవలే రిలీజైంది. 


జులన్‌ గోస్వామి క్రికెటర్‌ కావాలనుకున్నప్పుడు.. మహిళలు క్రికెట్‌ గురించి ఆలోచించేందుకు చాలా కష్టమైన పరిస్థితులుండేవంటూ అనుష్క పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో జులన్‌ గోస్వామి క్రికెటర్‌గా (Cricketer‌) ఎదిగిన తీరును సినిమాగా రూపొందిస్తున్నామంటూ అనుష్క తెలిపింది. ఇక చక్‌దా ఎక్స్‌ప్రెస్‌ మూవీకి ప్రొసిత్‌ రాయ్‌ డైరెక్షన్ వహిస్తున్నారు. తన స్వీయ నిర్మాణ సంస్థ అయిన క్లీన్‌ స్టేట్‌ ఫిల్మ్స్‌ ద్వారా అనుష్క ఈ మూవీని నిర్మిస్తోంది. అనుష్కశర్మ ఆమె సోదరుడు కర్నేష్‌ శర్మ ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.


జులాన్‌ (Jhulan) లైఫ్‌లోని ఎత్తుపల్లాలను, క్రికెటర్‌గా జులాన్ సాధించిన విజయాలను ఆవిష్కరిస్తూ చక్‌దా ఎక్స్‌ప్రెస్‌ మూవీ తెరకెక్కనుంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. ఇక జులాన్ గోస్వామి దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా, (Bowler‌) కెప్టెన్‌గా వ్యవహరించారు. గతేడాది ఆమె అన్నీ ఫార్మెట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.


Also Read : Weekend Curfew: ఢిల్లీ, కర్ణాటకల్లో నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ.. అమలులోకి ఈ నిబంధనలు


కాగా అనుష్క ఈ ఏడాది మొత్తం మూడు ప్రాజెక్ట్‌లకు సైన్‌ చేయనుంది. అందులో ఒకటి ఇప్పటికే ఓటీటీ (OTT) వేదికగా రిలీజ్‌ అయ్యేలా ప్లాన్ చేశారు. మరో రెండు పెద్ద ప్రాజెక్ట్‌లను కూడా అనుష్క ఒకే చేయనున్నారు. ఆ రెండు మూవీలు థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్‌ మరికొన్ని రోజుల్లోనే రానున్నాయి.



 


Also Read : Horoscope Today January 8 2022: ఆ రాశి వారికి వార్నింగ్.. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook