Anushka Shetty New Movie: అనుష్కశెట్టి.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ పేరు చూడడం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ గతేడాది ఓటీటీ వేదికగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌లను అనుష్క ఎప్పుడు ప్రకటిస్తుందా? అని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తన పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులకు అనుష్క చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన తదుపరి ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తన 48వ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా సిద్ధం కానుంది. మరోవైపు యూవీ క్రియేషన్స్-అనుష్క కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఆ బ్యానర్‌లో వచ్చిన ‘మిర్చి’, ‘భాగమతి’ అనుష్కకు మంచి హిట్స్‌ అందించాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Also Read: Lala Bheemla Full Song: పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘లాలా..భీమ్లా’ సాంగ్ వచ్చేసింది! 


Also Read: Sunil First Look In Pushpa: ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను లుక్ రిలీజ్.. భయంకరంగా సునీల్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి