Yatra 2 First look: ఏపీ సీఎం జగన్ బర్త్ డే గిఫ్ట్, యాత్ర 2 ఫస్ట్‌లుక్ విడుదల
Yatra 2 First look: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు గుడ్‌న్యూస్ అందించారు ఆ చిత్ర దర్శకుడు. జగన్ జీవిత కధ నేపధ్యంలో తెరకెక్కుతున్న యాత్ర 2 ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Yatra 2 First look: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్ యాత్ర 2 ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. జగన్ పుట్టినరోజు బహుమతిగా దర్శకుడు మహి వి రాఘవ్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. జగన్ పాత్రలో ముమ్మాటికీ ఇమిడిపోయినట్టు కన్పిస్తున్నారు జీవా.
2019 ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపధ్యంతో దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా నుంచే నేను విన్నాను..నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే డైలాగ్ ప్రాచుర్యం పొందింది. ఆ సినిమాకు సీక్వెల్ యాత్ర 2. యాత్ర మొదటి భాగం వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర ప్రకటనతో సినిమా ఎండ్ అవుతుంది. ఇప్పుడు రెండవ భాగాన్ని యాత్ర 2గా మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నారు.
రెండవ భాగం జగన్ చేసిన పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వంటి ఘట్టాలతో సాగనుంది. మొదటి భాగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి జీవించగా యాత్ర 2లో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవ కన్పించనున్నారు. ఇవాళ వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా యాత్ర 2 ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో జగన్ పాత్రలోని జీవ కుర్చీలో కూర్చుని ఉంటే బ్యాక్ గ్రౌండ్‌లో మరో కుర్చీలో వైఎస్ పాత్ర పోషించిన మమ్ముట్టి ముఖం కన్పిస్తోంది. పోస్టర్‌లో జగన్ పాత్రలో జీవ అద్భుతంగా సెట్ అయ్యారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అందరూ అతని పని అయిపోయిందనుకున్నారు, కానీ అతనికి తెలుసు అది ప్రారంభమని అనే క్యాప్షన్‌తో జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహి వి రాఘవ్ ఎక్స్‌లో ఫస్ట్‌లుక్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రస్తుత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు పురస్కరించుకుని ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సహా అందరూ విషెస్ తెలియజేశారు.
Also read: Salaar: ఆ రెండు సీన్స్ కోసమే A సర్టిఫికెట్.. పావుగంట ఏడ్చానన్న ప్రశాంత్ నీల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook