Appudo Ippudo Eppudo Movie Review: ‘అప్పుడో ఇప్పడో ఎప్పుడో’ మూవీ రివ్యూ..
Appudo Ippudo Eppudo Movie Review: నిఖిల్ తెలుగులో వరుస హిట్స్ తో దూకుడు మీదున్నాడు. అంతేకాదు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో అలరిస్తున్నారు. కార్తికేయ 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. తాజాగా నిఖిల్ సిద్దార్ధ్.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo)
నటీనటులు: నిఖిల్ సిద్ధార్ధ్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, వైవా హర్ష, అజయ్, జాన్ విజయ్, సత్య, సుదర్శన్ తదితరులు..
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: రిజర్డ్ ప్రసాద్
సంగీతం: కార్తి, సన్ని ఎం.ఎఆర్
నిర్మాత : BVSN ప్రసాద్
దర్శకత్వం: సుధీర్ వర్మ
విడుదల తేది: 8-11-2024
నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కార్తికేయ2తో నేషనల్ లెవల్లో గుర్తింపు పొందారు. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటూ మన ముందుకు వచ్చారు. ఇందులో రుక్మిణి వసంత్, మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. లవ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.వి.సి.సి.పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో ‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ లవ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
రిషి(నిఖిల్)కి కార్ రేసింగ్ అంటే పిచ్చి. అందులో మంచిగా సంపాధించి సెటిల్ అయిపోవాలని చూస్తుంటాడు. అలా చిన్న చితకా రేసులతో కాలం గడిపేస్తూ వుండే రిషి... తనుండే కాలనీలో ఉండే తార(రుక్మిణి వసంత్)ని ప్రేమిస్తాడు. కానీ తనతో మాట్లాడే ధైర్యం లేక ఒక రోజు తార ఫోన్ కి తన ప్రేమ విషయం మెసేజ్ చేస్తాడు. కానీ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రిప్లై వస్తుంది. దీంతో లవ్ ఫెయిల్యూర్ అయిన రిషి తనతో అసలు మాట్లాడకుండానే రేసర్ గా పనిచేయడం కోసం లండన్ వెళ్తాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్) పరిచయమై తనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ పెళ్లి రోజు తులసి కనిపించకుండా పోతుంది. కొన్నాళ్ల తర్వాత తార కూడా లండన్ వచ్చి రిషికి తారసపడుతుంది. మళ్ళీ వీరిద్దరి మధ్యలో లవ మొదలవుతుంది. తార ప్రపోజ్ చేసే టైంకి మిస్ అయిన తులసి వస్తుంది. దీంతో తార రిషిని వదిలేసి వెళ్ళిపోతుంది. అదే సమయంలో తులసి హత్యకు గురవుతుంది. అదే సమయంలో ఓ లండన్ డాన్ బద్రి నారాయణ్(జాన్ విజయ్) రిషి, అతని ఫ్రెండ్ యాజీ(వైవా హర్ష)ని ఓ డివైజ్ కోసం కిడ్నాప్ చేస్తారు. అసలు వీళ్ళను ఎందుకు కిడ్నాప్ చేసారు? ఆ డివైజ్ ఏంటి? వెళ్లిపోయిన తులసి మళ్ళీ ఎందుకు వచ్చింది? తార – రిషి ప్రేమ ఫలించిందా? తులసిని ఎవరు హత్య చేసారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
థ్రిల్లర్ మూవీస్ కి మంచి ప్లాట్ రాసుకుని... దాని చుట్టూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపిస్తే... ఆడియన్స్ బాగా థ్రిల్ అవుతారు. దర్శకుడు సుధీర్ వర్మ కూడా అలాంటి గ్రిప్పింగ్ కథ... కథనాలుండే మరో మంచి ఫీల్ గుడ్ లవ్ థ్రిల్లర్ ను తనకు బాగా కనెక్ట్ అయిన నిఖిల్ తో తీశారు. గతంలో వీరిద్దరి కాంబోలో స్వామి రారా, కేశవ సినిమాలు వచ్చి మెప్పించాయి. ఇప్పుడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటూ ఓ వైవిధ్యమైన స్క్రీన్ ప్లే మూవీని రాసుకుని తెరకెక్కించారు. మొదట్లో స్క్రీన్ ప్లేను అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా వున్నా... ఆ తరువాత సెకెండాఫ్ తో కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ లో తులసి చనిపోయే సీన్ తో సినిమా ఓపెన్ చేసి... ఆ తరువాత ఒకేసారి రెండు లవ్ స్టోరీలు, ఓ క్రైం స్టోరీ నడిపిస్తూ వాటన్నిటిని తీసుకొచ్చి కనెక్ట్ ట్ చేయడం వల్ల ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ లో కథ... కథనాలు కొంత నెమ్మదిగా సాగినా... సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్ లు రివీల్ చేస్తుంటే ఆసక్తిగా ఉంటుంది. సెకెండాఫ్ లో వచ్చే చాలా ట్విస్టులు థ్రిల్లింగ్ గా వున్నాయి. ముఖ్యంగా తులసి ఇచ్చే ట్విస్టులన్నీ అదిరిపోతాయి. ఎక్కువ భాగం లండన్ లో షూటింగ్ జరగడం వల్ల ఈ సినిమాలో ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. లండన్ వీధుల్లో ఛేజింగ్ లు... ఫైటింగులన్నీ చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ కు ఇస్తాయి.
దర్శకుడు రాసుకున్న కథ.. కథనాలు వైవిధ్యంగా వున్నాయి. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను ఎంతో కుర్చోలోంచి లేవకుండా నడిపించారు. ఇదొక ఫీల్ గుడ్ లవ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లండన్ అందాలను బాగున్నాయి. హీరో, హీరోయిన్లను అందంగా చూపించారు. నేపథ్య సంగీతం బాగుంది. థ్రిల్లర్ మూవీస్ కి ఎలాంటి బీజీఎం ఉంటుందో అలాంటిదాన్ని బాగా క్యారీ చేశారు. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ వుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. సినిమా మొత్తం లండన్ షూట్ చేయడంతో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు.
నటీనటుల విషయానికొస్తే..
నిఖిల్ రిషి పాత్రలో ఒదిగిపోయాడు. తన ఆహర్యం కూడా ఓ రేస్ కుర్రాడు ఎలా వుంటాడో అలా డిజైన్ చేశారు. తొలిసారి తెలుగులో నటించిన రుక్మిణి వసంత్ తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది. తన అందం... అమాయకత్వంతో పాటు ఆహర్యంతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. అలాగే మోడ్రన్ గాళ్ గా దివ్యాంశ కౌశిక్ కూడా రెండు వేరియాక్షన్స్ లో తన యాక్టింగ్ మెప్పించింది. డాన్ పాత్రలో బద్రి నారాయణగా జాన్ విజయ్ కామెడీ విలనిజాన్ని పండించేశాడు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అతని మిత్రుడిగా మున్నా పాత్రలో అజయ్ కూడా బాగా నటించారు. చివరి దాకా సినిమాను నెరేట్ చేస్తూ... కమెడియన్ సత్య, సుదర్శన్ లు పర్వాలేదు అనిపించారు. హీరో ఫ్రెండ్ పాత్రలో వైవా హర్ష పాత్ర బాగుంది. మిగతపాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
పంచ్ లైన్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆకట్టుకునే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.