Arjun Kapoor: కపూర్ కుటుంబంలో కరోనా కలకలం.. ఏకంగా నలుగురికి పాజిటివ్! ఇల్లుకు సీల్!!
ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. రెండు వారాల క్రితం కరీనా కపూర్ ఖాన్ వైరస్ బారినపడి కోలుకోగా.. తాజాగా అర్జున్ కపూర్ (Arjun Kapoor)కు వైరస్ సోకింది. అర్జున్ కపూర్‌తో పాటు అతడి కుటుంబంలోని మరో ముగ్గురికి ఈరోజు పాజిటివ్ అని తేలింది. అర్జున్ సహా రియా కపూర్, కరణ్ బూలానీ, అన్షులా కపూర్‌కు సైతం కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉండగా.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఇల్లుకు సీల్ వేసింది.
Arjun Kapoor test positive for Coronavirus: ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. రెండు వారాల క్రితం కరీనా కపూర్ ఖాన్ వైరస్ బారినపడి కోలుకోగా.. తాజాగా అర్జున్ కపూర్ (Arjun Kapoor)కు వైరస్ సోకింది. అర్జున్ కపూర్‌తో పాటు అతడి కుటుంబంలోని మరో ముగ్గురికి ఈరోజు పాజిటివ్ అని తేలింది. అర్జున్ సహా రియా కపూర్, కరణ్ బూలానీ, అన్షులా కపూర్‌కు సైతం కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉండగా.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఇల్లుకు సీల్ వేసింది.
కరీనా కపూర్ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అర్జున్ కపూర్‌తో పాటు అతని సోదరి అన్షులా కపూర్ (Anshula Kapoor) మహమ్మారి బారినపడ్డారు. కరోనా సోకడంతో ఇటీవల తమను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. అయితే అర్జున్ కపూర్ గర్ల్‌ఫ్రెండ్ మలైకా అరోరా (Malaika Arora) కూడా కరోనా పరీక్షలు చేసుకోగా.. నెగెటివ్‌గా వచ్చింది. ఇటీవల అర్జున్, మలైకా ముంబైలో రొమాంటిక్ డిన్నర్ డేట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెగెటివ్ వచ్చినా.. మలైకా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆమె కూడా క్వారంటైన్ నిబంధనలు పాటిస్తున్నారని సమాచారం.
Also Read: Oke Oka Jeevitham Teaser: ఆసక్తిగా 'ఒకే ఒక జీవితం' టీజర్.. శర్వానంద్ కూల్ లుక్స్ అదుర్స్!!
ఇక రియా కపూర్ (Rhea Kapoor), తన భర్త కరణ్ బూలానీ (Karan Boolani)కి కూడా కరోనా వచ్చింది. ఈ విషయాన్ని రియా తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీ ద్వారా తెలిపారు. వీరిద్దరు కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. 'ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ.. నేను నా భర్త వైరస్ బారిన పడ్డాం. మేమిద్దరం క్వారంటైన్ అవుతున్నాం. వైద్యులు సూచించిన మెడిసిన్ తీసుకుంటున్నాం' అని పేర్కొన్నారు. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా రావడంతో అప్రమత్తమైన బీఎంసీ.. కపూర్ నివాసానికి సీల్ వేసింది. ఇంటి పరిసరాలను శానిటైజ్ చేస్తుంది. అర్జున్ కపూర్ గతేడాది సెప్టెంబర్‌లో తొలి సారిగా కరోనా బారినపడ్డారు.
Also Read: Eesha Rebba Photos: వైట్ డ్రస్సులో.. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్లకు గాలమేస్తున్న ఈషా రెబ్బా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి