Arundhathi Nair Accident: ప్రముఖ మలయాళీ హీరోయిన్ అరుంధతి నాయర్ యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఆమె స్కూటీపై వెళుతుండగా మార్చి 14న బైక్ ప్రమాదానికి గురయ్యారు. స్కూటీ పై వెళుతుండగా ఓ కారు ఆమె ప్రయాణిస్తోన్న స్కూటీని ఢీ కొట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె కేరళ రాష్ట్రం తిరువనంతపురం అనంతపురిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆర్ధికంగా సాయం చేసేందకు ముందుకు రావాలని ప్రముఖ నటి గోపిక అనిల్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అరుంధతి నాయర్ స్కూటిపై వెళుతుండగా కోవలం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగినట్టు చెబుతున్నారు.  ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదం జరిగినపుడు అరుంధతి నాయర్ తన బ్రదర్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నట్టు ఆమె సోదరి ఆర్తి నాయర్ మీడియాకు తెలిపారు. ఓ యూట్యూబ్‌కు ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. అరుంధతి 2014లో 'పొంగి ఎజు మనోహరా' మూవీతో తమిళంలో తెరంగేట్రం చేసింది. 2018లో ఆ తర్వాత విజయ్ ఆంటోని హీరోగా నటించిన 'షైతాన్‌' మూవీలో కథానాయికగా నటించింది. అటు 'ఒట్టకోరు కాముకన్' తో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అరుంధతి నాయర్ 'ఆయిరం పోర్కసుకల్' అనే తమిళ చిత్రంలో కనిపించింది.


కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఏషియా నెట్‌లో 'కేరళ సమాజం' అనే టెలివిజన్ సీరియల్‌లో రియా పాత్రలో నటించింది. అటు మలయాళం, తమిళంలోని వచ్చిన వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటించింది. ఇక అరుంధతి నాయర్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్ధిస్తున్నారు.


ఇదీ చదవండి: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి .



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి