Arundhathi Nair Critical Condition: చావు బతుకుల్లో ప్రముఖ హీరోయిన్.. డబ్బులు లేక సాయం కోసం ఎదురు చూపులు..
Arundhathi Nair Critical Condition: రీసెంట్గా ప్రముఖ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈమె పరిస్థితి ఎంతో క్రిటికల్‌గా ఉంది. అంతేకాదు డబ్బులు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
Arundhathi Nair Critical Condition: ఈ మధ్యనే ప్రముఖ హీరోయిన్ అరుంధతి నాయర్ బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలసిందే కదా. ఈ నెల 14న అరుంధతి నాయర్ స్కూటీపై వెళుతుండగా ఆమె ప్రయాణిస్తోన్న వాహానాన్ని ఓ కారు ఢీ కొట్టింది. ప్రెజెంట్ ఈమె కేరళలోని తిరువనంతపురం అనంతపురిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఐసీయూలో చావు బతుకుల మధ్య ఉంది. ఆర్ధికంగా అంతగా నిలదొక్కుకోలేని ఈమె చికిత్స కోసం ఆమె కుటుంబ సభ్యులు సాయం అర్ధిస్తున్నారు. ఇప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీ వాళ్లను డబ్బు సాయం చేయమని కోరినా.. ఏ ఒక్క హీరో కానీ ఇతర నటీనటులు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పటికే తమిళనాడును ఉద్దరిస్తామన్నా.. కమల్ హాసన్, విజయ్, విశాల్ సహా ఏ హీరో ముందుకు రాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది ప్రముఖ నటి రమ్య. అటు నడిగర్ సంఘం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అరుంధతి నాయర్ పరిస్థితి ఎంతో క్రిటికల్‌గా ఉంది. ఈమెకు బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక రోడ్ యాక్సిడెంట్ జరిగినపుడు అరుంధతి నాయర్ తన సోదరుడితో కలిసి ప్రయాణం చేస్తున్నట్టు ఆమె సిస్టర్ ఆర్తి నాయర్ మీడియాకు తెలిపారు. ఓ యూట్యూబ్‌కు ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి అరుంధతి నాయర్ తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అరుంధతి 2014లో 'పొంగి ఎజు మనోహరా' మూవీతో తమిళంలో తెరంగేట్రం చేసింది. 2018లో ఆ తర్వాత విజయ్ ఆంటోని హీరోగా నటించిన 'షైతాన్' మూవీలో కథానాయికగా నటించింది. అటు 'ఒట్టకోరు కాముకన్' తో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అరుంధతి నాయర్ 'ఆయిరం పోర్కసుకల్' అనే కోలీవుడ్ చిత్రంలో నటించింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఏషియా నెట్‌లో 'కేరళ సమాజం' అనే టెలివిజన్ సీరియల్‌లో రియా పాత్రలో నటించింది. అటు మలయాళం, తమిళంలోని వచ్చిన వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటించింది.
Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్
Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook