Aryan Khan Drugs Case: డ్రగ్స్‌ కేసులో (Drugs Case) అరెస్టయిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పలుమార్లు బెయిల్ నిరాకరించిన సంగతి కూడా తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై మరోసారి విచారణ జరగనుంది. ఇపుడు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి ఒక హీరోయిన్ తో వాట్సాప్ చాట్ చేసిన సంచలన నిజాలను బయటపెట్టింది. ఆ హీరోయిన్ కొత్తగా బాలీవుడ్ (Bollywood)కి ఎంట్రీ ఇచ్చిందని.. ఆర్యన్ ఖాన్ ఆ హీరోయిన్ తో డ్రగ్స్ గురించి వాట్సాప్ చాటింగ్ ద్వారా చర్చించారని... వాటి సంబంధిత ఆధారాలను ఎన్‌సీబీ కోర్టుకు సమర్పించింది. 



Also Read: Buddha Venkanna Arrest:ఆంధ్రలో హైటెన్షన్...రోడ్లపై టీడీపీ నేత బుద్దా వెంకన్న కర్రలతో హంగామా


డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్ షా కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబైలోని (Mumbai)ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. రెండు సార్లు బెయిల్ నిరాకరణ జరిగిన సంగతి తెలిసిందే! ఈ రోజు మరోసారి విచారణ జరగనుండగా.. వాట్సాప్ కు చాట్ కు (Whats app Chat) సంబందించిన కీలక ఆధారాలను ఎన్‌సీబీ (NCB) న్యాయవాది కోర్డుకు సమర్పించగా.. ఆర్యన్ బెయిల్ గురించిన తీర్పు ఈ రోజు మధ్యాహ్నం వెలువడనుంది. బెయిల్ మంజూరు అవుతుందా..? లేక మళ్లీ నిరాకరిస్తారా.. అని షారుకు కుటుంబీకులతో పాటూ.. పూర్తీ బీ-టౌన్ ఎదురుచూస్తుంది. 


Also Read: Srikakulam: చెరువులో బోల్తా పడిన స్కూలు బస్సు.. ఒక విద్యార్ధి మృతి, నలుగురికి గాయాలు (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి