Aryan Khan Released From Jail: ముంబై క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్‌ లభించినప్పటికీ.. విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చాడు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్‌, ఆయన సతీమణి గౌరీఖాన్‌.. ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వచ్చారు. ఈ కేసులో అరెస్టయిన 28 రోజుల తర్వాత ఆర్యన్‌ తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. కానీ, అవి సకాలంలో జైలుకు చేరలేదు. విడుదల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆర్యన్‌ శుక్రవారం రాత్రి కూడా జైల్లో ఉండక తప్పలేదు. శనివారం ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది ఆర్యన్‌ను విడుదల చేశారు. 


28 రోజుల తర్వాత..


డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులను న్యాయస్థానం శుక్రవారం జారీ చేసింది. మొత్తం 14 షరతులు విధిస్తూ ఆర్యన్‌కు (Aryan Khan’s Bail) బెయిల్‌ ఇచ్చింది. అతడితో పాటు అర్బాన్‌ ఖాన్‌, మున్మున్‌కు బెయిల్‌ ఇచ్చింది.


అయితే బెయిల్‌ మంజూరుకు న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. ఇందులో రూ.లక్ష బాండ్‌ ఒకటి. ఈ బాండ్‌కు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు. జూహీ జామీనును కోర్టు అంగీకరించింది. అనంతరం బెయిల్‌ పత్రాలను తీసుకుని షారుక్‌ న్యాయ బృందం నిన్న సాయంత్రం జైలుకు బయల్దేరినప్పటికీ అప్పటికే నిర్దిష్ట సమయం ముగిసిపోయింది. దీంతో శనివారం ఉదయానికి విడుదల ప్రక్రియ పూర్తవ్వడంతో ఆర్యన్‌ను విడుదల చేశారు. మూడు వారాలపాటు జైలులో ఉన్న ఆర్యన్‌.. నేడు జైలు నుంచి బయటకు వచ్చాడు.


మన్నత్‌కు వెలుగుల కళ..


ఆర్యన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన నాటి నుంచి షారుక్‌ కుటుంబం దిగులులో కూరుకుపోయింది. పండగలు, వేడుకలకు దూరంగా ఉంది. గౌరీఖాన్‌ అయితే కొడుకు విడుదలవ్వాలని నిత్యం పూజలు చేసినట్లు ఆమె సిబ్బంది తెలిపారు. ఆర్యన్‌ ఇంటికొచ్చేవరకు మన్నత్‌లో స్వీట్లు వండొద్దని గౌరీ ఆదేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆర్యన్‌ బెయిల్‌పై విడుదలవడంతో షారుక్‌ నివాసం మన్నత్‌లో మళ్లీ కోలాహలం నెలకొంది. నిన్న రాత్రి మన్నత్‌ను లైట్లతో అలంకరించారు. అటు ఆర్యన్‌ కోసం షారుక్‌ అభిమానులు ఈ ఉదయం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.


Also Read: Aryan Khan Bail : బెయిల్‌పై బయటికొస్తున్న ఆర్యన్ ఖాన్‌.. ముస్తాబైన ‘మన్నత్’


Also Read: Aryan Khan’s Bail Surety: నటి జూహీ చావ్లా పూచీకత్తుతో ఆర్యన్ ఖాన్ కు బెయిల్   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook