Venu Swamy about Young Hero Death జాతకాలు నమ్మేవారు ఎంత మంది ఉంటారో.. నమ్మని వాళ్లు కూడా అంతే మంది ఉంటారు. ఎవరి అభిప్రాయం వారిది అన్నట్టుగా వదిలేస్తే.. వేణు స్వామి అనే జ్యోతిష్య నిపుణుడు టాలీవుడ్ సెలెబ్రిటీల మీద చేసే కామెంట్లు మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. రష్మిక మందాన్న వచ్చి వేణు స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేయించుకున్న సంగతి కూడా తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్మిక కెరీర్ బాగుంటుందని చెప్పాడు. విజయ్‌తో కలిసి రిలేషన్‌లో ఉన్నందుకే ఇప్పుడు ఇలా జాతకం మారిపోయిందని, ఈ ఇద్దరికీ జాతకాలు  పడవని వేణు స్వామి చెప్పాడు. నాగ చైతన్య సమంతల పెళ్లి టైంలోనే విడాకులు అవుతాయని వేణు స్వామి చెప్పడంతో అంతా కొట్టి పారేశారు. కానీ చివరకు అదే నిజమైంది.


ఇప్పుడు వేణు స్వామి మాటలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో, హీరోయిన్ చనిపోతారని వేణు స్వామి చెప్పాడు. యంగ్ అంటే ఓ నలభై ఏళ్లున్న హీరో చనిపోతాడు అంటూ రీసెంట్‌గా వేణు స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.


ఆ యంగ్‌ హీరో తారకరత్నేనా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టే జరుగుతున్నాయా? అని ఇంకొంత మంది అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ యాదృశ్చికాలని, ఇప్పుడు కూడా ఇలాంటి నమ్మేవారు ఉంటారా? అని ఇంకొంత మంది కొట్టి పారేస్తున్నారు.


అయితే యంగ్ హీరోయిన్ కూడా చనిపోతుందని వేణు స్వామి చెప్పడం, ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరై ఉంటారా? అని జనాలు తలాతోకలేనట్టుగా ఆలోచిస్తున్నారు. మొత్తానికి వేణు స్వామి మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాడు. తారకరత్న మరణ, అంత్యక్రియల వార్తలు ఎంతగా అందరినీ కదిలించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వేణు స్వామి మాటలు కూడా అంతే ఆలోచనల్లో పడేస్తున్నాయని జనాలు అంటున్నారు.


Also Read:  Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్


Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook