MAA Elections: సంచలనం రేపుతున్న పృథ్వీరాజ్ ఆడియో టేప్.. రసవత్తరంగా `మా` ఎన్నికలు
మంచు విష్ణు ప్యానల్ నుండి పోటీ చేస్తున్న పృథ్వీరాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి ఫోన్ చేసిన ఆడియో టేప్ సంచలనం రేపుతోంది.. ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడిన తీరు మీరే ఒకసారి వినండి.
Prudhviraj Audio Tape: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు (Movie Artists Association Elections) రసవత్తరంగా రోజు రోజుకు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ (Prakash raj)మరియు మంచు విష్ణు ప్యానల్ (Manchu Vishnu Panel) వాళ్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
తాజాగా మెగా బ్రదర్ నాగేంద్ర బాబు (Naga Babu) కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ (Prakash Raj Panel) కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన మంచు విష్ణు (Manchu Vishnu) ప్యానల్ నుండి పోటీ చేస్తున్న పృథ్వీరాజ్ ఆడియో టేప్ (Prudhviraj Audio Tape) సంచలనం రేపుతుంది.
Also Read: Sex Rocket in Hyderabad: సనత్‌నగర్‌లో సెక్స్ రాకెట్.. బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం!
ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి ఫోన్ చేసిన పృథ్వీరాజ్ (Prudhviraj) చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.. ఈ ఫోన్ కాల్ లో... " ప్రజారాజ్యం (Prajarajyam Party) తరపున వైజాగ్ (Vizag ) నుండే నా రాజకీయ ప్రస్తానం మొదలైంది, వైజాగ్‌తో మంచి సంబంధాలున్నాయి, పక్కోళ్లు తొక్కుతున్న బొమ్మలాట సాగింపు ఏంటి..?? అతనిలో ఏం చూసి మీరు మద్దతు ఆయనకే అంటున్నారు... ప్రకాష్ రాజ్ ను రెండు సార్లు ఫిల్మ్ చాంబర్ (Film Chamber) నుండి సస్పెండ్ చేసాము.. క్రమశిక్షణ బాగోలేదని సస్పెండ్ చేసిన ఆయన మాకు క్రమశిక్షణ గురించి తెలపటం ఏంటి"అన్నారు.
అంతేకాకూండా, "కన్నడ (Kannada) షూటింగ్ కి వెళ్తే.. డేడికేట్ పర్సన్.. అంటూ విగ్ లాగేసారు.. ఇక్కడ కన్నడ నటులే నటించాలని అనగానే... సిగ్గుతో తల వంచుకొని తిరిగొచ్చా... చెన్నై (Chennai) లో వాళ్లకి వాళ్లు మూవీ అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకున్నారు. ఎవరైనా ఎక్కడి నుండైనా పోటీ చేయోచ్చు... కానీ మనల్ని పరిపాలించకూడదు. అలాంటి వాళ్లు మీకు అంత నచ్చాడా..?? పరాయిభాష వాళ్లపై మీకు అంత ఇష్టమేంటి..? ఏది ఏమైనా సరే.. నా స్లోగన్ ఒక్కటే 'తెలుగువాడిని గెలిపిద్దాం.. తెలుగు వాళ్ల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం" అని పృథ్వీరాజ్ (Prudhviraj Audio Tape) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: NTR Video Call with Fan: రీల్ హీరోనే కాదు.. మన యంగ్ టైగర్ రియల్ హీరో కూడా... Video
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook