NTR Video Call with Fan: రీల్ హీరోనే కాదు.. మన యంగ్ టైగర్ రియల్ హీరో కూడా... Video

అభిమానులను దేవుళ్లుగా భావించే యంగ్  టైగర్... యాక్సిడెంట్ లో బాధపడుతున్న అభిమానికి వీడియో కాల్ ద్వారా చెప్పారు. ప్రస్తుతం ఈ వీధిలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా... హాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్లు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 03:32 PM IST
  • రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని నిరూపించిన తారక్
  • అభిమానికి వీడియో కాల్ ద్వారా ధైర్యం చెప్పిన యంగ్ టైగర్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో..మీరే చూడండి
NTR Video Call with Fan: రీల్ హీరోనే కాదు.. మన యంగ్ టైగర్ రియల్ హీరో కూడా... Video

NTR Video Call with Fan: మనదేశంలో సినీ హీరోలను సొంత వ్యక్తులగా ఆరాధిస్తారు. ముఖ్యంగా తెలుగువారైతే అభిమాన హీరో కోసం ఎంత దూరమైన వెళ్తారు. ఫ్యాన్సే కాదు.. హీరోల కూడా వారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు వ్యక్తపరుస్తుంటారు. ఈ విషయంలో టాలివుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Juior NTR) ఒకడుగు ముందే ఉంటారు. సిని వేదికలపై 'అభిమాన దేవుళ్లు' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వారికి ప్రాధాన్యం ఇచ్చే తారక్ (Tarak).. తాజాగా యాక్సిడెంట్ అయి,ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ అభిమాని కోరిక తీర్చి అతని కళ్లల్లో సంతోషాన్ని నింపారు. 

వివరాల్లోకి వెళ్తే..... తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) మలికిపురం (Makilipuram) మండలం గూడపల్లికి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి (KOppadi Murali) అనే వ్యక్తి తారక్ కు వీరాభిమాని. ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరాడు. రెండు కిడ్నీలు పాడవ్వడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సారి మాట్లాడాలని ఉందని ఓ కాగితంలో రాసి డాక్టర్ కు తెలియజేశాడు. వైద్యులు ఈ విషయాన్ని అతని పేరెంట్స్ కు చెప్పారు. తల్లిదండ్రుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న తారక్ అభిమానులు.. సమాచారాన్ని ఎన్టీఆర్ కు చేరవేశారు. 

Also Read: Chaysam Divorce: ప్రీతంపై పెరిగిన ట్రోల్స్.. స్పందించిన సమంత మేకప్ ఆర్టిస్ట్‌ సాధనాసింగ్‌

దీంతో వీడియో కాల్ ద్వారా సదరు అభిమానితో, అతడి కుటుంబ సభ్యులతో తారక్ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. "ధైర్యంగా ఉండండి. నీకేం కాదు త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి క్షేమంగా వచ్చేస్తావు" అని అభిమానికి భరోసానిచ్చారు. అభిమాని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశారు. ఇందులో రామ్ చరణ్ (Ram Charan), అజయ్ దేవగణ్ (Ajay Devaghan), ఆలియా భట్ (Alia Bhatt), సముద్రఖని (Samudra Khani) లాంటి భారీ తారాగణం నటిస్తోంది. వీరు కాకుండా హాలీవుడ్ (Hollywood) నటులు ఆలిసన్ డూడి (Alison Doody), రే స్టీవెన్ సెన్. ఒలివియా మోరీస్ లాంటి నటులు ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.

Also Read: WhatsApp users jumped to Telegram: వాట్సాప్‌కి షాక్ ఇస్తూ టెలిగ్రామ్‌లో చేరిన 70 మిలియన్ల మంది యూజర్స్

ఈ చిత్రంలో తారక్ గోండు వీరుడు కొమురం భీమ్ (Komaram BHeem) పాత్రను పోషిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా (Alluri SeetharamaRaju) నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకలు ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కాకుండా కొరటాల శివతో (Koratala Shiva) ఓ చిత్రం, కేజీఎఫ్ (KGF) దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashant Neel)తో మరో సినిమాను తారక్ ప్లాన్ చేశారు. వీటితో పాటు బుల్లితెరపై 'ఎవరు మీలో కోటీశ్వరులు' (Yevatu meelo Koteeshvarudu) అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News