'బాహుబలి' సినిమా దేశవ్యాప్తంగా ఎంతో ఘనవిజయం సాధించిందన్న విషయం అందరికీ తెలిసిందే..! ప్రభాస్ నటనకు టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవూడ్ కూడా ఫిదా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇండియన్ ఐకాన్‌గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ టాలీవుడ్ స్టార్‌కి 'మిర్చి' తరువాత ఫిమేల్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిందండోయ్..! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే 90వ దశకం నాటి హీరోయిన్ రవీనా టాండన్‌తో ప్రభాస్ రహస్యంగా మీట్ అవ్వడమే అసలు కథ. అసలే ఆయన పెళ్లి విషయంలో సస్పెన్సు కొనసాగిస్తున్నాడు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి హీరోయిన్ అనుష్క అని..కాదు ఎవరో బిటెక్ అమ్మాయి అని.. సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. 


వివరాల్లోకి వెళితే.. 


ముంబైలో 'బాహుబలి' 100 డేస్ ఫంక్షన్ జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఫంక్షన్‌‌లో 'బాహుబలి టీమ్'తో బాలీవుడ్ నటి 'మస్త్ మస్త్' హీరోయిన్ రవీనా పాల్గొంది. అక్కడ ప్రభాస్‌తో దిగిన సెల్ఫీలను పోస్ట్ చేసింది.. 'ప్రభాస్ ఫాన్స్ కోసం ఈ ఫోటో పంచుకుంటున్నానని.. ప్రభాస్‌కు పంజాబీ వంటలు బాగా నచ్చాయని' కూడా ఆమె పేర్కొంది. ఇక అంతే.. సోషల్ మీడియాలో ప్రభాస్ రవీనాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొట్టింది. కొందరు అభిమానులు ప్రభాస్, రవీనాను పెళ్లి చేసుకుంటాడేమో అన్న సందేహాన్ని కూడా వెల్లిబుచ్చారు. అయితే ఆమెకి ఇప్పటికే పెళ్ళి అయ్యిందన్న వార్త తెలుసుకున్న ఆ అభిమానులు కంగుతిన్నారు.




 


ఉత్తరాదిలో 'బాహుబలి' సినిమాలను రవీనా భర్త అనిల్ టాండనీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాడు. దాంతో అనిల్, ప్రభాస్ మధ్య స్నేహం బలపడింది. రవీనా అంటే ప్రభాస్‌కు ఎంతో అభిమానం అని కూడా తెలుసుకున్నాడు అనిల్. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రవీనా, ప్రభాస్ ఇద్దరూ రహస్యంగా కలిశారని వార్తలు వచ్చాయి. ప్రభాస్ డిన్నర్‌కు ఇంటికి ఆహ్వానించి ఆమెపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడట. 'నేను రవీనాకు పెద్ద అభిమానిని. అందాజ్ అప్నా అప్నా చిత్రంలోని ఎలోజి సనమ్ అనే పాటను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు' అని ప్రభాస్ ఇటీవలే ఓ పత్రికకు చెప్పాడు. మరొక విషయం ఏమిటంటే.. గతంలో రవీనా కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించింది. బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో మొదలైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది


ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా దర్శకుడు సుజీత్.