Prakruti Mishra Attacked on Road: ఒరియా నటి ప్రకృతి మిశ్రాను ఒరియా హీరో బాబుషాన్ మొహంతి భార్య తృప్తి సత్పతి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమెను బాబుషాన్ మొహంతి భార్య కొట్టడం కనిపిస్తుంది. వైరల్ గా మారిన ఈ వీడియోలో, ప్రకృతి కారులో ఒక బాబుషాన్ భార్య ఆమెను గట్టిగా పట్టుకుని కనిపించింది. ప్రకృతి తనని కాపాడమని అడుగుతూ ఉంటే చుట్టుపక్కల వారు సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపించారు కానీ ఆమెను కాపాడిన పాపాన పోలేదు. అయితే చివరికి ఎలాగోలా ఆమె కారులోంచి బయటకు వచ్చిన తరువాత, బాబుషాన్ భార్య ఆమెను కారులో ఫాలో అవడంతో ఆమెను తప్పించుకునేందుకు ఆమె ఆటో ఎక్కింది. ఇక ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అసలు ఎవరీ తృప్తి సత్పతి?


30 ఏళ్ల తృప్తి సత్పతిభార్య) వ్యాపారవేత్త లలిత్ సత్పతి ఏకైక కుమార్తె. తృప్తి భర్త బాబుషాన్ ఆలీవుడ్ ఒకప్పటి సూపర్ స్టార్ ఉత్తమ్ మొహంతి, అపరాజిత మొహంతిలకు ఏకైక కుమారుడు. ప్రస్తుతం బాబుషాన్ తన సూపర్ హిట్‌ సినిమాలతో ఒడియా సినీ పరిశ్రమను శాసిస్తున్నారు. తృప్తి సత్పతి 6 ఏప్రిల్ 2014న బాబు షాన్ ను వివాహం చేసుకున్నారు. ఆమె వివాహమైనప్పుడు ఆమె వయస్సు 23 సంవత్సరాలు. ఎలాంటి ప్రచారం, మీడియాకు చిక్కకుండా ప్రైవేట్‌గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు మినహా పరిశ్రమకు చెందిన చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. ఒడిశా మీడియా వర్గాల ప్రకారం, తృప్తి సత్పతి బాబూషన్ మొహంతీకి చిన్ననాటి చిరకాల స్నేహితురాలు. వారిద్దరూ భువనేశ్వర్‌లోని DAV పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఈ జంట 5 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత 6 ఏప్రిల్ 2014న భువనేశ్వర్‌లోని మేఫెయిర్ హోటల్‌లో వివాహం చేసుకున్నారు. అయితే బాబుషాన్ నటుడు కావడంతో ఆయనకు తన సహనటితో అక్రమ సంబంధం ఉందని తృప్తి అనుమానిస్తోంది. ఇక వారిద్దరూ కలిసి కనిపించడంటోన్ ఆమె దాడి చేసినట్టు తెలుస్తోంది.


ప్రకృతి ఏమంటున్నారు?


ఈ దాడి తరువాత ప్రకృతి తన సోషల్ మీడియా ద్వారా స్పందిందింది. ప్రతి కథకు రెండు పార్శ్వాలు ఉంటాయి. దురదృష్టవశాత్తు ఆడవాళ్ళ మాట వినకుండా దూషించే సమాజంలో మనం జీవిస్తున్నామని అన్నారు. నేను నా సహనటుడు బాబూషన్ ఒక అసోసియేషన్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు చెన్నైకి వెళ్తున్నాము. ఆ సమయంలో బాబూషాన్ భార్య కొందరు గూండాలతో వచ్చి నాపై దాడి చేసింది. బాబుషాన్ భార్య ఇలా చేయడాన్ని నేను సహించను అని పేర్కొంది.


ఇక నటించనన్న బాబుషాన్


ఇక ఈ ఘటన తరువాత బాబుషన్ మాట్లాడుతూ, 'ప్రస్తుతం వైరల్ వీడియోను అందరూ చూసి ఆనందిస్తారు కానీ అసలు ప్రకృతిని నేనే ఆహ్వానించానని అన్నారు. ఉత్కల్ దివస్ వేడుకలో పాల్గొనేందుకు మేము కలిసి చెన్నై వెళ్ళడానికి వెళ్తున్నప్పుడే ఈ ఘటన జరిగిందని అన్నారు. నా సరసన ప్రకృతి నటించిన నా సినిమాను ప్రమోట్ చేయడానికి నేను అక్కడికి వెళ్లానని ఆయన అన్నారు. బాబూషన్ ఇంకా మాట్లాడుతూ, 'మా కుటుంబం ఇలా ఆలోచిస్తున్నట్లు నాకు తెలియదు. నా కుటుంబానికి ఇబ్బంది కలిగితే ఆమెతో ఇక సినిమా చేయను. అవసరమైతే భవిష్యత్తులో ఏ నటితోనూ కలిసి పనిచేయను అని పేర్కొన్నారు.


తృప్తి సత్పతి ఏమంటున్నారు?


ఇక ప్రకృతి తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసిందని తృప్తి ఆరోపించింది. "మన్మత్ మిశ్రా కుమార్తె ప్రకృతి మిశ్రా మా జీవితంలోకి వచ్చే వరకు మా వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంది" అని అన్నారు. ప్ర‌క్రుతి కెరీర్‌లో ఎదగడం కోసమే బాబుషాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందని తృప్తి ఆరోపించింది. ఆమె తనకు మద్యం, గంజాయి సరఫరా చేసిందని కూడా తృప్తి ఆరోపించింది. తన భర్తను తిరిగి పొందడానికి ప్రయత్నించానని, అప్పుడు ప్రకృతి తనను తన భర్తను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసిందని కూడా ఆమె వెల్లడించింది. ప్రకృతి కడా తమను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని వెల్లడించారు. ఇక ఈ ఘటనపై ఖార్వెల్ నగర్ పోలీస్‌లో కేసు నమోదు అయింది. ప్రకృతి మిశ్రా తల్లి కృష్ణప్రియ మిశ్రా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ఐపీసీ సెక్షన్లు 341, 294, 323, మరియు 506 కింద కేసు నమోదు చేశారు.


Also Read: Karan Johar: నయనతారను అలా అవమానించాలా.. కరణ్ జోహార్ పై అభిమానుల ఫైర్


Also Read: Ravi Kishan: బన్నీ విలన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..ఎరక్క పోయి ఇరుక్కుపోయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.