Baby movie 05th Day Box Office collections: చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టింది 'బేబీ'. ముఖ్యంగా ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇందులో లీడ్ రోల్స్ చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తమ యాక్టింగ్ తో కన్నీళ్లు పెట్టించారు. తొలి రోజు సాదాసీదాగా ఉన్న కలెక్షన్లు రెండో రోజు ఒక్కసారిగా దూసుకుపోయాయి. గత నాలుగు రోజులుగా థియేటర్లన్నీ హౌస్ పుల్ బోర్డులతో కళకళ్లాడుతున్నాయి. ఐదో రోజు కూడా అదే జోరును కొనసాగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెుత్తంగా ఐదు రోజుల్లో బేబీ మూవీ ప్రపంచవ్యాప్తంగా  34.9 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 28.15 కోట్లు రాబట్టింది ఈ మూవీ. ఓవర్సీస్ లో రూ.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్ 29.9 కోట్లుగా ఉంది. వచ్చే శుక్రవారానికి ఈ సినిమా ఈజీగా రూ.50 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉంది. నాలుగో రోజు ఈ సినిమా 7.4 కోట్లు గ్రాస్, మూడో రోజు రూ. 7.9 కోట్లు గ్రాస్ ను అందుకుంది. 


ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్,  కలిసి నటించిన చిత్రం బేబి (Baby). ఈ సినిమాకు  సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించారు. ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.  ఈ చిత్రాన్ని లవ్ స్టోరీస్‌లో కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులు అభివర్ణిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. అంతేకాకుండా ఈ సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు కురిపించారు. 


Also Read: Sri Ramana: టాలీవుడ్ లో మరో విషాదం.. ‘మిథునం’ కథా రచయిత శ్రీరమణ కన్నుమూత..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook