Bigg Boss Baladitya Elimination : బిగ్ బాస్ ఇంట్లో ఆదిత్య ఎలిమినేషన్ ప్రక్రియ ఎంతో సింపుల్‌గా సాగింది. లాస్ట్ వీకెండ్‌లో గీతూ చేసినంత రచ్చ అయితే బాలాదిత్య చేయలేదు. అసలు బాలాదిత్య అయితే ఎలిమినేట్ అయిన విషయాన్ని కూడా అంతగా పట్టించుకోలేదు. పైగా ఇంట్లోంచి బయటకు వస్తున్న సమయంలోనూ అతి ఎమోషన్స్ చూపించలేదు. కంటెస్టెంట్లను నవ్వుతూ ఉండేలానే చూశాడు. తాను కూడా ఎంతో పాజిటివ్‌గా ఇంటి నుంచి బయటకు వచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక స్టేజ్ మీద మాత్రమే జర్నీ వీడియోను చూసి బాలాదిత్య కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఏడ్చాడు. కానీ గీతూ మాదిరిగా.. ఏడ్చేసి, నానా రచ్చ చేసి, నేను వెళ్లను అంటూ మారాం చేయలేదు. ఎంత బిగ్ బాస్ అంటే ఇష్టమని ఉన్నా కూడా నామినేషన్‌ను తీసుకోలేకపోయింది. ఓవర్ డ్రామా చేసింది. స్టేజ్ మీద కుప్పకూలిపోయింది. తన మీద తనకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే అలా ఎలిమినేషన్‌ను తీసుకోలేకపోయింది.


కానీ బాలాదిత్య మాత్రం ఎంతో మెచ్యూర్డ్‌గా ప్రవర్తించాడు. అంతే కాకుండా సిగరెట్లు మాని.. అది తన వీక్ నెస్ కాదని నిరూపించుకున్నాడు. వారమంతా కూడా సిగరెట్లు తాగకుండా ఉన్నాడు. తన విల్ పవర్ ఏంటో మళ్లీ బిగ్ బాస్ తనకు నిరూపించిందని అన్నాడు. మొత్తానికి బాలాదిత్య మాత్రం ఫుల్ పాజిటివ్‌ ఇమేజ్‌తో బయటకు వచ్చాడు.


గీతూ మాత్రం ఫుల్ నెగెటివ్ ఇమేజ్‌తోనే బయటకు వచ్చింది. ఆమెకు వచ్చిన నెగెటివిటీ ఏ కంటెస్టెంట్‌కు రాలేదు. బాలాదిత్యకు వచ్చినంత పాజిటివ్ ఇమేజ్ మరో కంటెస్టెంట్‌కు రాలేదు. ఈ సీజన్లో బాలాదిత్య, గీతూలు వ్యతిరేక దిశలో ఉన్నారు. మెచ్యూరిటీకి మారుపేరుగా బాలాదిత్య ఉంటే.. గీతూ మాత్రం మ్యానిపులేటర్‌గా మిగిలిపోయింది. మంచి మనిషిలా ఆదిత్య బయటకు వస్తే.. గేమ్‌లు మాత్రమే ఆడే గేమర్‌గా మిగిలింది. 


బాలాదిత్య లాంటి మోస్ట్ మెచ్యూర్డ్ కంటెస్టెంట్‌ను మళ్లీ చూడలేం. నీ లాంటి మంచి వ్యక్తిని మళ్లీ చూడలేను అంటూ ఆదిరెడ్డి అన్నాడు. ఈ ఇంట్లో మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ నువ్వే అని ఆదిత్యను నాగార్జున పొగిడేశాడు. అతి మంచితనమే బాలాదిత్యను ముంచినట్టుంది. ఇక ప్రవచనాలు ఇవ్వడం కూడా జనాలకు అంతగా నచ్చినట్టు లేదు. ప్రతీదానికి బాలాదిత్య ఇచ్చే వివరణను జనాలు సోదిగా భావించినట్టున్నారు. అందుకే బాలాదిత్య ఎలిమినేట్ అయి ఉండొచ్చు. కానీ బాలాదిత్య విన్నర్ అయ్యేందుకు అన్ని అర్హతలున్న కంటెస్టెంట్. కానీ ఇలా బిగ్ బాస్ ఇంటి నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. అందుకే బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.


Also Read : Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!


Also Read : Ram Charan on Acharya: కంటెంటే కింగ్.. అందుకే ఆ సినిమాను చూడలేదు.. రామ్ చరణ్ పరోక్ష కామెంట్స్!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook