NBK - Samara Simha Reddy: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో సమరసింహారెడ్డి మూవీ ఒకటి. పాతికేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తన పేరిట రాసుకుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇపుడీ మూవీని మరోసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసి రీ రిలీజ్ చేస్తుంది. ఈ రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన డబ్బులను నందమూరి బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఇవ్వనున్నట్టు సదరు నిర్మాణ సంస్ధ తెలిపింది. అప్పట్లో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని చెంగల వెంకట్రావు నిర్మించారు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఇందులో అన్ని పాటలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ మూవీ అప్పట్లోనే రూ. 22 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.


ఇక బాలయ్య ముగ్గురు భామలు నటించడం మొదలైంది ఈ సినిమాతోనే అని చెప్పాలి. అప్పటి నుంచి తన సినిమాల్లో ముగ్గురు హీరోయిన్స్ సెంటిమెంట్ రిపీట్ చేస్తూనే ఉన్నాడు బాలయ్య. ఈ మూవీ ఫ్యాక్షన్ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. అప్పటికే తెలుగులో శ్రీరాములయ్య, ప్రేమించుకుందాం రా సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చాయి. కానీ పూర్తి స్థాయిలో ఈ తరహాలో తెరకెక్కిన చిత్రం సమరసింహారెడ్డి అనే చెప్పాలి.


ఈ సినిమా సక్సెస్‌ తర్వాత తెలుగులో చాలా మంది హీరోలు ఫ్యాక్షన్ బాట పట్టారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ చాలా మంది హీరోలు కత్తి పట్టి బాక్సాఫీస్ దగ్గర తొడగొట్టారు. ఈ మూవీని ఇపుడు రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూట్యూబ్ తో పాటు ప్రముఖ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది వీక్షించారు. మార్చి 2 న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అలాంటి సినిమాను ఇపుడు పనిగట్టుకొని వచ్చి థియేటర్‌లో చూస్తారా అనేది చూడాలి.


ఇదీ చదవండి: Ruchaka Rajyog 2024: రుచకరాజ్యయోగం ఈరాశికి ప్రత్యేకం.. మార్చిలోగా కొత్త ఉద్యోగం, కాసులవర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook