NBK 107 Movie: నందమూరి బాలకృష్ణ నటించే చిత్రాలు విదేశీ నేపథ్యంలో సాగడం అరుదు. ఆయన కొత్త సినిమా అమెరికాతో ముడిపడిన కథతో తెరకెక్కనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఇటీవల ఆరంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ కలిసి నిర్మిస్తున్నారు. జనవరి నుంచి చిత్రీకరణ షురూ కానుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. బాలకృష్ణను రెండు కోణాల్లో సాగే పాత్రలో చూపించనున్నారు. వాస్తవ సంఘటనలు, అమెరికా నేపథ్యంలో సాగే కథ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలయ్య  హీరోగా నటిస్తున్న 107వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. పక్కా మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య ఫుల్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు జోడీగా నటి శ్రుతిహాసన్‌ సందడి చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మరోవైపు ఇటీవల విడుదలైన ‘క్రాక్‌’ చిత్రంతో గోపీచంద్‌ మలినేని సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్నారు. ఇక, బాలయ్య ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబరు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: యూట్యూబ్ లో మరో రికార్డు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్


Also Read:  టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook