Balakrishna Losing Sankranthi Race: 2023 సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో తలపతి విజయ్ వారసుడు సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. అయితే ఇప్పుడు వారసుడు సినిమా ఎఫెక్ట్ నందమూరి బాలకృష్ణ థియేటర్లపై పడే అవకాశం కనిపిస్తోంది. వారసుడు సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. నిజానికి ఈ సినిమాను లాంచ్ చేస్తున్న సమయంలోనే ఇది తమిళ, తెలుగు బైలింగ్యువల్ మూవీ అని ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ కాలం గడుస్తున్న కొద్ది దాన్ని పూర్తిగా తమిళ సినిమా అంటూ సంబోధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఆడో తమిళ సినిమానే అని తెలుగులో డబ్బింగ్ చేసామని చెబుతున్నారు. అయితే దిల్ రాజు నైజాం ప్రాంతంలో ఎక్కువ ధియేటర్లను కలిగి ఉన్నారు. తన థియేటర్లలో వారసుడు సినిమా ఖచ్చితంగా పడేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి తోడు ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాలలో కూడా ఎక్కువ ధియేటర్లు వారసుడు సినిమాకి దక్కేలా దిల్ రాజు తన వ్యాపార మెళకువలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం మీద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖ విడుదల చేసింది. ఎగ్జిబిటర్లు తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇవ్వాలని ప్రకటించింది.


కానీ దిల్ రాజు టెక్నిక్స్ ముందు ఈ ప్రెస్ నోట్ వల్ల ఉపయోగం లేదని తేలిపోయింది. మరీ ముఖ్యంగా వైజాగ్లో వారసుడు సినిమాకి ఆరు థియేటర్లు దక్కినట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాకి నాలుగు థియేటర్లు దక్కగా వీర సింహారెడ్డి సినిమాకి కేవలం రెండే థియేటర్లు దక్కాయని చెబుతున్నారు. దీంతో వారసుడు ఎఫెక్ట్ చిరంజీవి కంటే ఎక్కువగా బాలకృష్ణ మీద పడుతోందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమాని గోపీచంద్ మళ్లీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని డైరెక్టర్ బావి తెరకెక్కిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఏ సినిమాలో బాబీ సింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తిస్థాయి విశాఖపట్నం నేపథ్యంలోని ఒక జాలరిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి దిల్ రాజు విషయంలో బాలకృష్ణ సీరియస్ గా తీసుకోకపోతే ఇదే పరిస్థితి అన్ని ఏరియాలో థియేటర్ల మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి సంక్రాంతికి పరిస్థితి ఎలా ఉండబోతుందని అనేది.
Also Read: Krishna Latest Health Bulletin: మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. మా చేతుల్లో ఏమీ లేదు.. డాక్టర్స్ కీలక ప్రకటన!


Also Read: Ram Charan Buchi Babu Movie: ఎన్టీఆర్ వద్దనుకున్న కథను ఫైనల్ చేసిన రామ్ చరణ్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook