Bhairava dweepam: రీరిలీజ్ కు రెడీ అయిన బాలయ్య `భైరవ ద్వీపం`.. ఈ సారి 4Kలో..!
Bhairava dweepam: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్. అలనాటి క్లాసిక్ `బైరవ ద్వీపం` రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ జానపద చిత్రాన్ని వచ్చే నెల 05న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Bhairava dweepam Re release: ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో జూ.ఎన్టీఆర్ సింహాద్రి, పవన్ కల్యాణ్ తొలిప్రేమ మళ్లీ విడుదలయ్యాయి. తాజాగా మరో మూవీ రీరిలీజ్ కు రెడీ అయింది. నందమూరి బాలకృష్ట హిట్ చిత్రాల్లో ఒక్కటైన 'భైరవ ద్వీపం' (Bhairava dweepam)ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ జానపద చిత్రం 1994లో విడుదలై అఖండ విజయం సాధించింది. అంతేకాకుండా ఈసినిమా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ క్లాసిక్ ను క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై చంద్రశేఖర్ కుమారస్వామి, పి. దేవ్ వర్మ ‘4K క్వాలిటీలోకి అప్‌గ్రేడ్ చేసి ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ (Balakrishna) సరసన రోజా హీరోయిన్ గా నటించింది. చందమామ విజయా కంబైన్స్ బ్యానర్‌పై బి.వెంకట్రామిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దివంగత నటుడు, రచయిత రావి కొండలరావు కథ అందించారు. ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, విజయకుమార్, కె.ఆర్.విజయ, రంభ, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్ తదితర నటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా ద్వారా విలన్ అవతారమెత్తారు విజయ రంగరాజు. ఈ చిత్రానికి సయ్యద్ కబీర్‌లాల్ సినిమాటోగ్రఫీ అందించారు. మాదవపెద్ది సురేష్ స్వరాలు సమకూర్చారు.
Also Read: Jawan Movie: షారుక్ 'జవాన్'లో దళపతి విజయ్.. సినిమా రిలీజ్ అప్పుడే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook