Jawan Movie: షారుక్ 'జవాన్‌'లో దళపతి విజయ్.. సినిమా రిలీజ్ అప్పుడే?

Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీంతో బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2023, 07:46 AM IST
Jawan Movie: షారుక్ 'జవాన్‌'లో దళపతి విజయ్.. సినిమా రిలీజ్ అప్పుడే?

Jawan Movie Update: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'జవాన్'(Jawan). ఇందులో షారుక్ జోడిగా నయనతార నటిస్తోంది. పఠాన్ తర్వాత షారుక్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని  ‘జవాన్‌’ యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న యానిక బెన్‌ కన్ఫామ్ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంలో షారుక్‌, విజయ్‌ల మధ్య ఓ యాక్షన్‌ సీన్ ఉందని.. అది అడియెన్స్ కు మంచి విజువల్ ట్రీట్ అవుతుందని బెన్ అన్నారు. దీంతో ఈ మూవీ కోసం బాద్ షా ఫ్యాన్స్ తోపాటు దళపతి ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా రూ.200 కోట్లతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మూవీపై ఆసక్తిని పెంచేశాయి. ఈ పోస్టర్లలో షారుఖ్ గుండుతోసహా పలు విభిన్న లుక్స్‌లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో షారుక్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అయితే ఈచిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone) కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తిచేసుకుంటుంది. ఈ మూవీ రిలీజ్ కు ముందే రూ. 300 కోట్ల వరకు లాభాలు ఆర్జించినట్లు తెలుస్తోంది.

Also Read: Nara Rohit: మరోసారి 'ప్రతినిధి'గా నారా రోహిత్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్‌లుక్‌..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News