Mokshagna First Movie: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంట్రీ ఎవరిది అంటే…నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ కోసమే అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి ఈ నందమూరి హీరో ఎంట్రీ ఎప్పుడు జరగనుంది అని సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. బాలకృష్ణ కూడా ఈ మధ్య త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి రానున్నారు అని అఫీషియల్ గానే చెప్పారు. ఈ క్రమంలో అసలు ఈ  హీరో మొదటి సినిమా ఎలాంటి కథతో ఉండబోతుంది.. ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే దాని పైన ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ప్రస్తుతానికి మోక్షజ్ఞ మొదటి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండచ్చని కొందరు అంటుంటే.. మరి కొంతమంది మాత్రం మోక్షజ్ఞ మొదటి చిత్రం ఆదిత్య 369 సీక్వెల్ అయ్యుండొచ్చని అంటున్నారు. కాగా ఈ విషయాలు పక్కన పెడితే.. బాలకృష్ణ ప్రస్తుతం మోక్షజ్ఞ గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.


నిన్న విశ్వక్ సేన్,‌ నేహా శెట్టి హీరో.. హీరోయిన్లుగా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కోసం బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.  ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ..’ముందుగా మా సోదరుడు విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. మేమిద్దరం ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అనుకుంటారు’ అని ఫన్నీగా చెప్పుకొచ్చారు. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాననని, విశ్వక్ కూడా తనలాగే ప్రతి సినిమాకి.. ప్రతి పాత్రకి కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడని మెచ్చుకున్నారు.


ఆ తరువాత తన మోక్షాజ్ఞ గురించి మాట్లాడుతూ..’నెక్ట్స్ మా మోక్షు కూడా సినిమాల్లోకి వస్తాడు.. నన్ను ఇన్‌స్పైరింగ్‌గా తీసుకోవద్దని, మీలాంటి వాళ్లు అంటే.. సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్, విశ్వక్ సేన్ వంటి వాళ్లను ఇన్స్పిరేషన్ గా తీసుకోమని.. నేను వాడికి చెబుతుంటాను’ అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ మీ. ఇక చివరిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి కొత్త దనం ఉన్న చిత్రాలను తెలుగు సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు.


Also Read: Riyan Parag: చిక్కుల్లో క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌.. హీరోయిన్ల హాట్‌ వీడియోలు వెతుకుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా


Also Read: Kiss Stops Marriage: ప్రేమతో పెట్టిన ముద్దుతో వివాహం రద్దు.. ఆస్పత్రిలో వరుడు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter