Balakrishna:వెండి ధర పైన.. బుల్లితెర పైన.. తెగ దూసుకుపోతున్నారు నట సింహం బాలకృష్ణ. వెండి ధర పైన వరుసగా అఖండ, వీర సింహారెడ్డి అలానే భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న ఈ హీరో బుల్లితెర పైన కూడా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె మూడు సీజన్లతో సూపర్ హిట్ అందుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా అన్స్టాపుల్ షో బాలకృష్ణకి చాలా పాజిటివ్ పాయింట్ గా నిలిచింది ఎందుకు అనగా ఆహాలో ఈ టాక్ షో మొదలైన దగ్గర నుంచి నుంచే బాలయ్యపై ఉన్న నెగిటివిటి తగ్గి, కంప్లీట్ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఈ టాక్ షోలో గత రెండు సీజన్స్ లో బాలకృష్ణ అని చూసిన వారందరూ ఆయన సరదా చేష్టలు చూసి ఆయనని మరింత ఇష్టపడడం ప్రారంభించారు. బాలకృష్ణ అంటే నచ్చని వారు కూడా ఈ షో చూసి ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు.


 లేటెస్ట్ గా స్టార్ట్ అయిన అన్ స్టాపబుల్ సీజన్ 3 లిమిటెడ్ ఎడిషన్ కూడా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. కాగా ఈ అనుష్టాపబుల్ షో ఇంత సూపర్ హిట్ అవ్వడానికి బాలకృష్ణ హుషారు ముఖ్య కారణం. ఆయన ఆ షో లో చేసే అల్లరి అలానే ఆ షో ని హొస్ట్ చేసే విధానం అందరినీ ఆకట్టుకునింది.


దీంతో ఇప్పుడు దెబ్బకి థింకింగ్ మారిపోవాలి అన్నట్టు బిగ్ బాస్ మేకర్స్ థింకింగ్ కూడా బాలకృష్ణ అండ్ స్టార్ ప్రభాస్ షో చూసి మారిపోయిందట. ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ని హోస్ట్ చేయడానికి బిగ్ బాస్ మేకర్స్ బాలకృష్ణ అని సంప్రదించాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ షోకి సెకండ్ సీజన్ నాని హోస్టింగ్ చేసాడు. మూడో సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఏడో సీజన్ వరకూ కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. కాక నాగార్జున హోస్ట్ చేసిన కొన్ని సీజన్లు బాగానే ఆకట్టుకోగా.. ప్రస్తుతం మాత్రం ప్రతి సీజన్ నాగార్జుననే ఉండడంతో ప్రేక్షకులు కొంచెం బోర్ గా ఫీల్ అవుతున్నారు.


రోజు రోజుకూ బిగ్ బాస్ షోకు ఆదరణ తగ్గుతోందని తెలుస్తోంది. ఇక హిందీలో, తమిళ్ లో పొలిస్తే తెలుగులో రేటింగ్ చాలా తక్కువగా ఉందంట. అందుకే ఎలాగైనా ఈ షో కి కొత్త హంగులు దిద్దాలి అని నటసింహం నందమూరి బాలకృష్ణ ఈసారీ రాబోతున్న సీజన్ కి హోస్ట్‌గా పెడితే రేటింగ్ అదిరిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందట. ఇక ఇదే నిజమైతే నాగార్జున ప్లేసులో బాలకృష్ణ వచ్చి మనల్ని మరోసారి బుల్లితెర పైన అల్లరించడం ఖాయం.


Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook