Balakrishna Wig Cost Revealed By His Personal Makeupman: సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని వారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకి కూడా చాలా ఉంటుంది. మరి ముఖ్యంగా తమ అభిమాన హీరోలు ఎలాంటి బట్టలు వాడుతున్నారు? ఎలాంటి కార్లు వాడుతున్నారు? ఎలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారనే విషయాలతో పాటు ఒకవేళ హీరోలు కనుక అయితే ఎలాంటి విగ్గులను వాడుతున్నారు. అలాంటి హెయిర్ స్టైల్ మేము తెచ్చుకోవాలంటే ఎలాంటి విగ్గులు కొనుగోలు చేయాలి? ఎక్కడ కొనుగోలు చేయాలి అలాంటి విషయాల మీద కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ మేకప్ వాసు కొప్పిశెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ వాడే విగ్గు ధర ఎంత ఉంటుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. నిజానికి నందమూరి బాలకృష్ణ తన సినిమాలకు విగ్గు వాడతారు అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. నిజానికి ఆయన ఎక్కువగా సినిమాల్లో డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోల్ ఒరిజినల్ గానే అనిపించినా రెండవ రోల్ కోసం కచ్చితంగా విగ్గు వాడాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడేవి. ఇక ఈ నేపథ్యంలోనే వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


Also Read: Chalaki Chanti Health: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు.. హుటాహుటిన హాస్పిటల్ కి!


మరీ ముఖ్యంగా వీరభద్ర సినిమాకి ఆయన విగ్గు సెట్ అవ్వలేదు కదా అని అడిగితే నిజానికి ఆ సినిమాకి తాను వర్క్ చేయలేదు కానీ రవిబాబు చౌదరి డైరెక్షన్లో రూపొందిన ఆ సినిమాకి విగ్గు ముందు సెట్ అయినట్టు అనిపించిందని తర్వాత స్క్రీన్ మీద మాత్రం అది ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆయనకు విగ్గులు ఒక్కోసారి ముంబై నుంచి తీసుకొస్తామని ఒక్కోసారి చెన్నై నుంచి తీసుకొస్తామని ఒక్కోసారి హైదరాబాదులో కూడా ఇప్పుడు అధునాతనమైన విగ్గులు అందుబాటులోకి వచ్చేసాయని ఆయన చెప్పుకొచ్చారు.


బాలకృష్ణ వాడే విగ్గుల ధర లక్షల్లోనే ఉంటుందని, తక్కువ రకం విగ్గులు ఆయన వాడరని ఆయన అన్నారు. అంతేకాక నందమూరి బాలకృష్ణ చాలా అందగాడని ఆయన అందానికి కాస్త మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాం తప్ప అందులో తన పనితనం ఏమీ లేదని ఈ సందర్భంగా వాసు చెప్పుకొచ్చారు.


నందమూరి బాలకృష్ణ విగ్గు సెంటిమెంట్ గురించి వాసు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ విగ్గుని సెంటిమెంట్ గా భావించరు కానీ అభిమానులు మాత్రం ఆయనకు కరెక్ట్ గా జుట్టు సెట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందనే విషయం నమ్ముతారని ఈ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నందమూరి బాలకృష్ణ ఒక్కొక్క విగ్గు కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే అన్నమాట. ఈ డబ్బు నందమూరి బాలకృష్ణ అకౌంట్ నుంచి కాకుండా నిర్మాత అకౌంట్ నుంచి వెళుతుంది ఎందుకంటే సినిమా కోసం లుక్ సిద్ధం చేయాల్సిన బాధ్యత కాబట్టి నిర్మాత అన్ని దగ్గరుండి చూసుకుంటారట. 


Also Read: Anil Sunkara Tragedy: ఏజెంట్ రిలీజ్ కు ముందు అనిల్ సుంకర ఇంట తీవ్ర విషాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook