Chalaki Chanti Health Update: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు.. హుటాహుటిన హాస్పిటల్ కి!

Chalaki Chanti Heart Stroke: చలాకి చంటికి గుండెపోటు వచ్చిందని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, సీరియస్ కండిషన్లో జబర్దస్త్ చలాకీ చంటి చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 23, 2023, 01:02 PM IST
Chalaki Chanti Health Update: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు.. హుటాహుటిన హాస్పిటల్ కి!

Heart Stroke to Chalaki Chanti: జబర్దస్త్ షో ద్వారా అనేకమంది కమెడియన్లు మంచి క్రేజ్ తెచ్చుకోవడమే కాదు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మారి అనేక సినిమాల్లో కూడా నటించారు చలాకి చంటి. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఏకంగా టీం లీడర్ కూడా అయిన చంటి తర్వాతి కాలంలో బిగ్ బాస్ అవకాశం రావడంతో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నా ఎక్కువ హౌస్ లోకి కొనసాగలేక బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చినప్పటి నుంచి అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్నాడు. కానీ ఎక్కువగా షోస్ లో మాత్రం కనిపించడం లేదు. అయితే అనూహ్యంగా చలాకి చంటికి గుండెపోటు వచ్చిందని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఇది ఎవరూ నమ్మలేదు కానీ ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అది నిజమేనని అంటున్నారు.

Also Read: Salman Khan vs Nani: నాని కలెక్షన్స్ లో సగం కూడా రాబట్టలేకపోయిన సల్మాన్..ఇంతకన్నా అవమానం ఉందా?

ప్రస్తుతం సీరియస్ కండిషన్లో జబర్దస్త్ చలాకీ చంటి చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయనకు సడన్ గా గుండె సంబంధిత నొప్పి రావడంతో హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్చారని తెలుస్తోంది. హాస్పిటల్ లో చేర్చిన సమయంలో చలాకీ చంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత సోమవారం అంటే రేపు గాని లేదా మంగళవారం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ఈ నేపద్యంలో చలాకీ చంటికి కూడా గుండెపోటు వచ్చిందని వార్త విని ఆయన అభిమానులు కలవర పడుతున్నారు.

అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని తెలియడంతో వారంతా కుదుటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ విషయం మీద అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కేవలం చలాకీ చంటి సన్నిహితులు చెబుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం మాత్రమే బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి కోలుకుంటే కానీ ఆయన తన ఆరోగ్యం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

Also Read: Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ మాస్.. మొదటి రోజును మించిన రెండో రోజు వసూళ్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News