Tragedy at Anil Sunkara House: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కమెడియన్ అల్లూ రమేష్ గుండెపోటుతో మరణించగా తర్వాత మలయాళ సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ మమ్ముట్టి తల్లి కూడా వయోభారం రీత్యా మరణించారు. ఇక అదే సినీ పరిశ్రమకు చెందిన రాజేష్ మాస్టర్ కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఏర్పాటు చేసి అనేక సూపర్ హిట్ సినిమాల నిర్మించిన అనిల్ సుంకర ఇంటా విషాదఛాయలు అలుముకున్నాయి. నిజానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఏజెంట్ సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ సినిమాలో రూపొందింది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పెద్ద ఎత్తున సినిమా యూనిట్ పాల్గొంటుంది.
Also Read: Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ మాస్.. మొదటి రోజును మించిన రెండో రోజు వసూళ్లు!
ఇలా ఒకపక్క సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న సమయంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర పెదనాన్న సుంకర బసవరావు మరణించారట. ఈ విషయాన్ని అనిల్ సుంకర తన ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి తాను విజయం సాధించడానికి పెదనాన్న అనేక బాటలు వేసినట్టు చెబుతూ అనిల్ సుంకర ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. నన్ను ఎంతగానో ప్రేమించి అన్ని రకాలుగా ప్రోత్సహించి నా విజయానికి బాటలు వేసిన వ్యక్తి మా పెదనాన్న ఆయన ఇక లేరన్న వార్తతో ఈరోజు నేను నిద్ర లేవాల్సి వచ్చింది.
మేము తీసుకొస్తున్న ఇన్నోవేషన్ ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని జీవితాంతం మిస్ అవుతాను అంటూ ఆయన ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు. బిందాస్ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన నమో వెంకటేశా, అహ నా పెళ్ళంట, దూకుడు, యాక్షన్ త్రీడీ, లెజెండ్, ఆగడు, రాజు గారి గది, కృష్ణగాడి వీర ప్రేమ గాధ, సరిలేరు నీకెవ్వరు, మహాసముద్రం వంటి సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఏజెంట్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా అది రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరోపక్క భోలా శంకర్ సినిమాని కూడా ఆయనే నిర్మిస్తున్నారు.
Also Read: Salman Khan vs Nani: నాని కలెక్షన్స్ లో సగం కూడా రాబట్టలేకపోయిన సల్మాన్..ఇంతకన్నా అవమానం ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook