Bandla Ganesh Tweets: పవన్ సినిమా ఓపెనింగ్ రోజే బండ్ల గణేష్ వింత ట్వీట్లు.. బాధ పడుతూ ఆవేదనతో!
Bandla Ganesh Tweets on OG Opening Day: పవన్ కళ్యాణ్ - సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది, అయితే అది జరిగిన రోజే బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Bandla Ganesh Tweets on OG Opening Day Goes Viral: ఒకపక్క సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేష్. నిర్మాతగా ఎదిగిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్ళతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ నిర్మాతగా మారిపోయారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత నటుడిగా కనిపించడమే మానేసిన ఆయన ఈ మధ్యనే సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో కూడా మళ్ళీ నటుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తరువాత అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్నారు.
అయితే తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఉన్నది ఉంటుంది లేనిది ఎప్పుడూ ఉండదు, దేనీని పట్టి ఉంచుకోవాలి దేనీని విడిచి పెట్టాలో తెలిసిన వాడే అసలైన మేధావి అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. విజయం అనేది ఆలస్యంగా లభించే ఓటమి, ఓటమి కూడా ఆలస్యంగా లభించే విజయం, ఓటమి ముగింపు కాదు, విజయం శాశ్వతం కాదు అంటూ వేదాంత ధోరణిలో ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే విధంగా మంచి వాడు ఎప్పుడూ మొండిగా నే ఉంటాడు ఎందుకంటే వాడికి నటించడం రాదు కాబట్టి అంటూ బండ్ల గణేష్ ట్వీట్లు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ఓ సినిమా చేస్తారని గతంలో ప్రకటించారు. ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో? డైరెక్టర్ ఎవరు అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ లేదు.
ఇటీవల సుజీత్ సింగ్ కథ చెప్పడం, దానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాక దాని ప్రారంభోత్సవం కూడా ఈ రోజే జరిగింది. ఈ క్రమంలో సరిగ్గా ప్రారంభోత్సవం జరిగిన కాసేపటికి బండ్ల గణేష్ ఈ మేరకు ట్వీట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తనకు సినిమా అవకాశం ఇవ్వనందుకే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన బాధను ఈ మేరకు వ్యక్త పరుస్తున్నాడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై మీ ఉద్దేశమేమిటో కింద కామెంట్ చేయండి.
Also Read: Top Music directors : మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన.. మ్యూజిక్ డైరెక్టర్లు ఒంటబట్టించుకుంటేనే మంచిది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి