MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో(MAA Elections 2021) కొత్త పోరుకు తెరలేచింది. ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj)కు మద్దతుగా పనిచేసిన బండ్ల గణేశ్‌(Bandla Ganesh).. ఆ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అంతేకాకుండా ఈ ఏడాది జరగబోయే ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా వరుస ట్వీట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tollywood Drug Case: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను విచారించిన ఈడీ.. ఏం ప్రశ్నలు అడిగిందంటే..?? ఫోటోస్


‘‘మాట తప్పను .. మడమ తిప్పను. నాది ఒకటే మాట - ఒకటే బాట. నమ్మడం - నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. ఘన విజయం సాధిస్తాను! మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఏంటో తెలియజేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే ‘మా’ సభ్యులు నమ్మరు. గొడవలతో ‘మా’ సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. ‘మా’ను బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు సొంతింటి కల నిజం చేద్దాం’’ అని బండ్ల గణేశ్‌  ట్వీట్లు చేశారు.



జీవితా రాజశేఖర్‌ రావడం నాకిష్టం లేదు..


‘ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్‌ రావడం నాకిష్టం లేదు. నాకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నో సార్లు కించపరిచారు. అందుకే నేను ఈ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నాను. ఆమెపై జనరల్‌ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నాను’ అని బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఆయనతో నాకు ఎలాంటి విభేదాల్లేవు: జీవితా 


బండ్లగణేశ్‌ చేసిన వ్యాఖ్యలపై నటి జీవితా రాజశేఖర్ స్పందించారు. ‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె మరోసారి స్పష్టం చేశారు. బండ్ల గణేశ్‌ కూడా ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. అంతేకానీ, నాకు వ్యతిరేకంగానో, లేదా నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం.  ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, లేదా ఓడినా సరే ‘మా’ కోసం పనిచేస్తా’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook