Jr NTR New Look : యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా (NTR 30) అప్డేట్ల గురించి ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. మొన్నామధ్య సినిమా కథా చర్చలు జరుగుతున్నట్టుగా ఫోటోలు షేర్ చేశారు. అందులో కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్, కొరటాల శివ ఇలా అందరూ కలిసి చర్చించుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ చిత్రం మాత్రం మార్పులకు లోనవుతూనే ఉంది. కథ మీద ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా ఎన్టీఆర్  కొరటాల శివ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్లు వస్తాయా? ఆ తదుపరి సినిమాల అనౌన్స్మెంట్ ఎప్పుడు జరుగుతుందా? అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు చూసి, ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు సంబరపడిపోతోన్నారు.


 



ఎన్టీఆర్ కొత్త లుక్ అయితే.. సినిమా కోసం కాదని, అదొక యాడ్ కోసమని తెలుస్తోంది. అయితే ఈ కొత్త లుక్ మీద బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. తాను నిర్మించిన బాద్ షా సినిమా లుక్‌ను, ఈ కొత్త లుక్‌ను కలిపి పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు బండ్ల గణేష్‌ను ఆడేసుకుంటున్నారు. ఎప్పుడూ గతాన్ని పట్టుకునే ఉంటావా? అంటూ తిడుతున్నారు.


ఆ రెండు లుక్స్‌ను ఎందుకు పోల్చుతున్నావ్‌ అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ఇది నా బాద్ షా సినిమా లుక్‌లానే ఉంది కదా?అని నువ్ అడినట్టుంది? ఆ పోస్ట్ చూస్తుంటే అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ కొత్త లుక్ మాత్రం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఇక ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించి బాలీవుడ్ హీరోయిన్‌ను దించాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నాడట. మరో వైపు జాన్వీ కపూర్‌ సైతం.. ఎన్టీఆర్‌తో నటించాలనే కోరిక, ఆశ ఉందని చెప్పుకొచ్చింది.


Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే


Also Read : Bigg Boss 10th week Elimination : డేంజర్‌ జోన్‌లో శ్రీసత్య, శ్రీహాన్‌, ఫైమా.. వేడుకున్న గలాట గీతూ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook