Bangarraju Blockbuster Meet : సీఎం జగన్ భేటీ గురించి చిరంజీవి.. నాగార్జునకు చెప్పిన విషయం రివీల్
Nagarjuna reveals about CM Jagan Chiranjeevi meet : రాజమహేంద్రవరంలో బంగార్రాజు మూవీ బ్లాక్ బస్టర్ మీట్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ హాజరయ్యారు. సీఎం జగన్‌తో జరిగిన భేటీ గురించి చిరంజీవి చెప్పిన విషయాలు వివరించాడు నాగార్జున.
Bangarraju Blockbuster Meet Nagarjuna reveals about CM Jagan and Megastar Chiranjeevi meet secrets : అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున, (Nagarjuna) నాగ చైతన్య (Naga Chaitanya) కలిసి నటించిన మూవీ.. బంగార్రాజు. (bangarraju) కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌ను అందుకుంది.
ఈ సందర్భంగా మూవీ యూనిట్ రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) బ్లాక్ బస్టర్ మీట్ (Blockbuster Meet) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ వేడుకలో నాగార్జున (Nagarjuna) పలు విషయాలపై మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌తో ఇటీవల జరిగిన భేటీ గురించి తన మిత్రుడు చిరంజీవిని అడిగానన్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి (Telugu Film Industry) అంతా మంచే జరుగుతుందని సీఎం జగన్ చెప్పారని చిరంజీవి తనకు చెప్పారన్నారు నాగ్. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు (CM Jagan) కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాగార్జున అన్నారు.
ఇక నందమూరి తారకరామారావు.. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటివారని అందరూ అంటుంటారని నాగ్ పేర్కొన్నారు. ఇవాళ ఎన్టీఆర్ (NTR) వర్ధంతి... తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఆయన్ని గుర్తు చేసుకోవాలి అని నాగార్జున తెలిపారు.
Also Read : Kiara Advani Photos: ప్రియుడితో మాల్దీవులు వెకేషన్ కు వెళ్లిన కియారా అడ్వాణీ?
ఇక ప్రపంచమంతా కరోనాతో భయపడుతున్నా సందర్భంలో సంక్రాంతికి సినిమా రిలీజ్ (Movie Release) చేయండి చూస్తాం అన్నట్లుగా ప్రేక్షకుల తనకు భరోసా ఇచ్చారన్నారు. చెప్పిన విధంగానే బంగార్రాజు మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారని నాగ్ (Nagarjuna) అన్నారు. తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు అని పేర్కొన్నారు నాగార్జున.
Also Read : Payal Rajput Photos: బుల్లిగౌనులో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook