Bangarraju Song Teaser: అక్కినేని స్టార్స్.. నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. దీంతో అటు ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించిన చిత్రబృందం.. మరోవైపు ప్రమోషన్స్ లోనూ జోరు చూపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో సాంగ్ ‘నా కోసం’ టీజర్ ను గురువారం (డిసెంబరు 2) ఉదయం విడుదల చేసింది చిత్రబృందం. 


 



 


‘నా కోసం’ సాంగ్ టీజర్ ఆకట్టుకునే విధంగా ఈ పాటలో అక్కినేని నాగ చైతన్య, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించారు. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ను ఈ రోజు బుధవారం (డిసెంబరు 2) సాయంత్రం 5.12 గంటలకు సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జునతో పాటు రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి తదితరులు నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమాకూ అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. 


Also Read: Bheemla Nayak - RRR Updates: సిరివెన్నెలకు సంతాపంగా ప్రమోషన్స్ ఆపేసిన ‘భీమ్లానాయక్’, ‘ఆర్ఆర్ఆర్’


Also Read: Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook