Bigg Boss 7 Telugu Grand Launch: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07లో ఊహించని ట్విస్టులకు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో కింగ్ నాగార్జున బిగ్ బాస్ లవర్స్ సరప్రైజ్ ఇవ్వనున్నాడు. వీకెండ్ జరిగే ఎపిసోడ్ కు హీరో సిద్ధార్థ్, మాస్ మహారాజా రవితేజ రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రోమోలు రిలీజ్ చేశారు. ఈసారి ఎలిమినేషన్ లో సస్పెన్స్ ఉండబోతుందని, వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా రాబోతున్నాయని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పది మంది ఉన్నారు. ఐదో వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సారి హౌస్ నుంచి బయటకు వెళ్లేది శుభ శ్రీ అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచనున్నారని టాక్. మరి ఈ సారి వైల్డ్ కార్డు ద్వారా ఎంత మంది హౌస్ లోకి వెళతారనేది ఆసక్తికరంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం జరిగే స్పెషల్ ఎపిసోడ్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వీరిలో సీరియల్ యాక్టర్స్ అర్జున్ అంబటి, పూజా మూర్తి, సింగర్ భోలే షావలి, యూట్యూబర్ నయని పావని, హాట్ హీరోయిన్ అశ్విని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గ్లామర్ డాల్స్ హౌస్ లోకి అడుగుపెట్టనుండటంతో హౌస్ అంతా హాట్ హాట్ గా మారిపోనుంది. సిద్ధార్థ్, రవితేజ తమ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు రానున్నారు. దీంతో ఆదివారం ఎపిసోడ్ మరింత సందడిగా మారనుంది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరినీ ఉతికి ఆరేశాడు నాగ్. ముఖ్యం సందీప్, అమర్ దీప్ లను అయితే ఓ రేంజ్ లో ఏసుకున్నాడు. దీంతో వారి నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. అయితే హౌజ్‌లో ఉన్న అమర్ దీప్ చౌదరి మాస్ మహారాజకు పెద్ద ఫ్యాన్. మరి ఇవాళ బిగ్ బాస్ కు రానున్న రవితేజ తన అభిమాని అయిన అమర్ కు సపోర్టు చేస్తాడో లేదా అనేది ఇవాళ జరిగే ఎపిసోడ్ ను చూడాల్సిందే. 


Also Read: HBD Manchu Lakshmi: ఆదిపర్వం ఫస్ట్ లుక్ రిలీజ్.. భయపెడుతున్న మంచు లక్ష్మీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి