Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త రికార్డు.. తెలుగు స్టార్ హీరోలకి కూడా దక్కలేదు!
Boypati: 2014లో అల్లుడు శీను చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 10 సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్న అతను అనుకున్న సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. అయితే ఫ్లాప్ చిత్రంతో అతను ఇప్పుడు ఒక సరికొత్త రికార్డు సృష్టించి.. టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు.
Jaya Janaki Nayaka: తెలుగు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కుటుంబాలలో బెల్లంకొండ ఫ్యామిలీ ఒకటి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ కుటుంబం తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతోంది. ఈ ఫ్యామిలీ నుంచి ఈ తరంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అల్లుడు శీను మూవీ ద్వార తన సినీ కెరీర్ ను ప్రారంభించిన సాయి శ్రీనివాస్ తొలి సినిమా తోటే మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఆరడుగుల పొడుగు.. దానికి తగిన ఫిజిక్ తో హీరోకి సరిపడా కట్ అవుట్ ఉన్నప్పటికీ ఎందుకో బెల్లంకొండ నటించిన సినిమాలు తెలుగులో పెద్దగా ఆదరణ పొందలేకపోయాయి. సుమారు దశాబ్దకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలి అని ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు సాయి శ్రీనివాస్. మన ఇండస్ట్రీలో అతను సక్సెస్ కాకపోయినప్పటికి, అతని సినిమాలకు బయట మాత్రం మంచి క్రేజ్ ఉందని చెప్పాలి.
బెల్లంకొండ నటించిన సినిమాలు డబ్బింగ్ వర్షన్ హిందీ యూట్యూబ్ ఛానల్ లో విడుదలవుతూ ఉంటాయి. అనుకోకుండా హిందీలో అతనికి మంచి ఆదరణ లభిస్తోంది. పైగా తెలుగులో ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేసి బెల్లంకొండ బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ నటించిన జయ జానకి నాయక అనే చిత్రాన్ని కూడా హిందీలో డబ్ చేసి యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు.
2017 లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బోయపాటి మూవీస్ అంటే హీరోకి ఏ రేంజ్ ఎలివేషన్ ఉంటుందో అందరికీ తెలుసు. ఈ మూవీలో కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కటౌట్ కి తగిన ఎలివేషన్, భారీ ఫైటింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో యవరేజ్ కలెక్షన్స్ సాధించి పరవాలేదు అనిపించుకుంది ఈ మూవీ.
అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వర్షన్ మాత్రం రికార్డులు బద్దలు కొడుతుంది. యూట్యూబ్ ఛానల్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ఏ సినిమా సాధించని వ్యూస్ తన ఖాతాలో వేసుకొని రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలు సైతం యూట్యూబ్ లో హిందీలో విడుదలైనప్పుడు ఇలాంటి రికార్డ్ సాధించలేకపోయాయి హిందీలో ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎనిమిది వందల మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీ హిందీ రైట్స్ కొనుక్కున్న పెన్ మూవీ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇలా మన దగ్గర ఫ్లాప్ అయిన సినిమా వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇది మామూలు విషయమైతే కాదు అంటూ ఈ సినిమాపై ఇప్పుడు నేటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్, ధర పరంగా ఇదే బెస్ట్!
Also Read: Movies Postponed: 'వ్యూహం, శపథం' మళ్లీ వాయిదా.. నారా లోకేశ్‌కు ఆర్జీవీ అదిరిపోయే పంచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter