Besharam Rang Song Controversy: పఠాన్ మూవీలో బేషరం రంగ్ సాంగ్ ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో సినిమాలో ఈ పాటను మాత్రమే కాదు.. మొత్తం సినిమానే బ్యాన్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన పఠాన్ మూవీలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించారు. జీరో సినిమా విడుదల తరువాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తోన్న సినిమా ఇది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే నాలుగోసారి కలిసి నటిస్తున్న పఠాన్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పఠాన్ మూవీలో బేషరం రంగ్ సాంగ్ సృష్టించిన వివాదం అలా సద్దుమణిగిందో లేదో తాజాగా ఈ పాటపై మరో వివాదం తెరపైకొచ్చింది. బేషరం రంగ్ సాంగ్ కంపోజిషన్ ను పాకిస్తాన్ లో 26 ఏళ్ల క్రితం వచ్చిన ఒక పాట నుంచి కాపీ చేశారనేది కొత్త వివాదం. 



 


పాకిస్థాన్ కి చెందిన సజ్జద్ అలీ అనే ఒక సింగర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఒక కొత్త సినిమా పాట వింటే తనకు 26 ఏళ్ల కిందట తను పాడిన పాటే గుర్తుచ్చిందంటూ ఆనాటి ఆ పాటను పాడి వినిపించాడు. ఆ పాటను విన్న నెటిజెన్స్.. ఈ పాట పఠాన్ మూవీలోని బేషరం సాంగ్ ని పోలి ఉందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. సజ్జద్ అలీ పఠాన్ మూవీపై నేరుగా కామెంట్స్ చేయనప్పటికీ.. అతడు పాడిన పాటకు, పఠాన్ మూవీలోని పాటకు కంపోజిషన్ సేమ్ ఉందంటూ నెటిజెన్స్ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.



పాకిస్థాన్ సింగర్ సజ్జద్ అలీ చేసిన వ్యాఖ్యలతో పఠాన్ మూవీ ఈసారి కాపీ రైట్స్ వివాదంలో చిక్కుకుంది. ఇంతా చేసి ఇంత పెద్ద స్టార్ హీరో కోసం కంపోజ్ చేసిన పాటను కూడా పాకిస్థాన్ నుంచి కాపీ కొడితే ఎలా అనే రియాక్షన్స్ వస్తున్నాయి. దీనికి పఠాన్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసిన విశాల్ దద్లాని -  విశాల్ శేఖర్ ద్వయం ఏమని వివరణ ఇస్తుందోననేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


ఇది కూడా చదవండి : Waltair Veerayya Pre Release Business : బాలయ్యపై చిరు పై చేయి.. ఏ ఏ ఏరియాలో ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాయంటే?


ఇది కూడా చదవండి : Rakul Preet Pics : రకుల్ బీచ్ ఫోటోలు.. న్యూ ఇయర్ హ్యాంగవుట్‌.. పిక్స్ వైరల్


ఇది కూడా చదవండి : Thalapathy Vijay Varisu : విజయ్ వారసుడు సినిమాను వీక్షించిన రామ్ చరణ్‌.. మెగా పవర్ స్టార్ రియాక్షన్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook