Thalapathy Vijay Varisu : విజయ్ వారసుడు సినిమాను వీక్షించిన రామ్ చరణ్‌.. మెగా పవర్ స్టార్ రియాక్షన్ ఇదే

Ram Charan Watches Varisu Movie రామ్ చరణ్ ఈ మధ్యే దళపతి విజయ్ వారసుడు సినిమాను చూశాడట. దిల్ రాజు స్పెషల్‌గా రామ్ చరణ్ కోసం సినిమాను చూపించాడట. చూపిస్తాను అని విజయ్‌ని అడిగితే.. హా చూపించండని విజయ్ అన్నాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 11:33 AM IST
  • సంక్రాంతి బరిలోకి దళపతి విజయ్
  • వారసుడు అంటూ టాలీవుడ్‌లో సందడి
  • వారిసు చిత్రాన్ని చూసిన రామ్ చరణ్‌
Thalapathy Vijay Varisu : విజయ్ వారసుడు సినిమాను వీక్షించిన రామ్ చరణ్‌.. మెగా పవర్ స్టార్ రియాక్షన్ ఇదే

Ram Charan Watches Varisu Movie దిల్ రాజు నిర్మించిన దళపతి విజయ్ వారిసు సినిమాను తాజాగా రామ్ చరణ్ వీక్షించాడట. రామ్ చరణ్‌ కోసం చెన్నైలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరిగిందని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్‌ సినిమాను చూసి ఫిదా అయ్యాడట. సూపర్‌గా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చాడట. అయితే విజయ్ వారిసు సినిమాను చూసేందుకు ప్లాన్ చేసింది మాత్రం దిల్ రాజు అని తెలుస్తోంది.

అసలే ఇప్పుడు దిల్ రాజు బ్యానర్‌లోనే శంకర్‌తో రామ్ చరణ్‌ సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్లాన్ చేశాడు. అయితే ముందు వారసుడు సినిమా కథను మన మహేష్ బాబుకే చెప్పాడట దిల్ రాజు. కానీ మహేష్‌ బాబు బిజీగా ఉండటంతో కుదర్లేదట. ఆ తరువాత అదే కథను రామ్ చరణ్‌కి కూడా వినిపించాడట. కానీ శంకర్‌తో సినిమా ఉండటం, డేట్స్ లేకపోవడంతో విజయ్ వద్దకు వెళ్లిందని దిల్ రాజు బయటపెట్టేశాడు.

 

దీంతో ఇప్పుడు రామ్ చరణ్‌ విన్న కథను.. ఎలా తీసి ఉంటారు.. తీస్తే ఎలా తీశారని చెప్పేందుకు రామ్ చరణ్‌కు ఈ సినిమాను ప్రత్యేకంగా వేసినట్టు తెలుస్తోంది. విజయ్‌కి ఇదే విషయాన్ని చెబితే.. వేసి చూపించండి అని అన్నాడట. సినిమాను చూసిన రామ్ చరణ్‌ అయితే వారసుడుని మెచ్చుకున్నాడని తెలుస్తోంది.

మరి సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. బాలయ్య వీర సింహా రెడ్డి, చిరు వాల్తేరు వీరయ్యలతో పాటుగా అజిత్ తెగింపు, విజయ్ వారసుడు కూడా రంగంలోకి దిగుతున్నాయి.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News