Bhagath Singh: పవన్ కల్యాణ్ PSPK28 సినిమాకు టైటిల్ ఇదేనా ?
Pawan Kalyan`s PSPK28 to get Bhagath Singh title: ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా తెరకెక్కుతుండగా.. సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ మూవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న PSPK28 మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
Pawan Kalyan's PSPK28 to get Bhagath Singh title: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్, హరి హర వీర మల్లు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా తెరకెక్కుతుండగా.. సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ మూవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న PSPK28 మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
PSPK28 మూవీ కోసం ఆ చిత్ర దర్శకుడు, నిర్మాతలు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో చెప్పుకుంటున్న టాక్ ప్రకారం భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టనున్నట్టు సమాచారం. దీనిపై ఎటువంటి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ టాక్. సినిమాలో కథకు, పవన్ కల్యాణ్ పోషించబోయే పాత్రకు భగత్ సింగ్ (Bhagath Singh) అనే టైటిల్ అయితేనే కరెక్టుగా సూట్ అవుతుందని మూవీ యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నట్టు ఆ టాక్ సారాంశం.
Also read : Manchu Manoj meets YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసిన మంచు మనోజ్
దాదాపు పదేళ్ల క్రితం పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) కలిసి గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ ఆ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. దబాంగ్ సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత హరీష్ శంకర్‌కి మళ్లీ అలాంటి హిట్ తగల్లేదు.
గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా ఇదే కావడంతో పట్టాలెక్కకముందే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దానికితోడు తాజాగా భగత్ సింగ్ (Bhagath Singh title for PSPK28) అనే టైటిల్ పరిశీలిస్తుండటం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
Also read : Bigg Boss Telugu 5 contestants full list: బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టంట్స్ పూర్తి జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook