Bigg Boss Telugu 5 contestants full list: బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టంట్స్ పూర్తి జాబితా

List of contestants in Bigg Boss Telugu season 5 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5వ షోలో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఒకరి తర్వాత మరొకరిగా మొత్తం 19 మందికి వెల్‌కమ్ చెప్పిన బిగ్ బాస్ హోస్ట్ నాగ్.. వారికి మధ్యమధ్యలో టాస్కులు ఇస్తూ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు. 

Written by - Pavan | Last Updated : Sep 6, 2021, 01:00 AM IST
  • అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షో.
  • ఈసారి ఎంటర్‌టైన్మెంట్, ఫన్ ఐదు రెట్లు ఉంటుందంటున్న నాగ్.
  • బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ రియాలిటీ షోలో పాల్గొంటున్న కంటెస్టంట్స్ పూర్తి జాబితా ఇదే.
Bigg Boss Telugu 5 contestants full list: బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టంట్స్ పూర్తి జాబితా

List of contestants in Bigg Boss Telugu season 5 : బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5 ప్రారంభమైంది. మూడు, నాలుగు సీజన్స్ హోస్ట్ చేసిన నాగ్ ఈసారి ఐదో సీజన్ కూడా అంతకంటే ఎనర్జిటిక్‌గా షురూ చేశాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5వ షోలో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి సిరి హనుమంత్ (Bigg Boss contestant Siri Hanumanth) ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు ఆడియెన్స్‌కి బెస్ట్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని సిరి చెప్పింది.  బిగ్ బాస్ హౌజ్ అంతా కలియ తిరిగిన సిరి.. తనకు బిగ్ బాస్ హౌజ్ ఎంతో నచ్చిందని తెలిపింది.

VJ Sunny : విజే సన్నీ
బిగ్ బాస్ హౌజ్‌లోకి సెకండ్ కంటెస్టెంట్‌గా టీవీ సీరియల్ యాక్టర్, వీజే సన్నీ (Bigg Boss contestant VJ Sunny) ఎంట్రీ ఇచ్చాడు. సరైనోడు సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన సన్నీ... వచ్చీ రావడంతోనే తెలుగు అమ్మాయిలను ఆకట్టుకునేలా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అడగ్గా.. తెలుగమ్మాయిలు అందరూ బాగుంటారని, తెలుగమ్మాయిలు తనకు బాగా నచ్చుతారని అమ్మాయిలకు సన్ని కితాబిచ్చాడు.

Lahari Shari : లహరి శేరి
మూడో కంటెస్టెంట్‌గా నటి లహరి శేరి (Bigg Boss contestant Lahari Shari) ఎంట్రీ ఇచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతో నటిగా పరిచయమైన లహరి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే నాగ్‌కి అరుదైన బ్లూ రోజ్ ఫ్లవర్ ఇవ్వడంతో పాటు తన లైఫ్ ఇంట్రో వీడియోతో నాగ్‌ని ఇంప్రెస్ చేసింది.

Singer Srirama Chandra : సింగర్ శ్రీరామ్ చంద్ర
నాలుగో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సింగర్ శ్రీరామ్ చంద్ర (Bigg Boss contestant Singer Srirama Chandra).. వచ్చీ రావడంతోనే తన సింగింగ్ టాలెంట్‌తో అటు బిగ్ బాస్ హోస్టుని, ఇటు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు.

Anee master: యానీ మాస్టర్
ఫేమస్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ (Bigg Boss contestant Anee master) ఐదో కంటెస్టంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంట్రో వీడియోతో తనను తాను పరిచయం చేసుకున్న యానీ మాస్టర్.. ఈసారి బిగ్ బాస్ విజేతగా అమ్మాయే గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

Lobo : లోబో
నటుడు లోబో (Bigg Boss contestant Lobo) ఆరో కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మాటీవీలో అవకాశం కోసం రోజూ గంటల తరబడి, అలా కొన్ని ఏళ్ల తరబడి వేచిచూసే వాడినని, ఆ తర్వాతే చివరకు ఓ రోజు మా మ్యూజిక్ ఛానెల్లో అవకాశం లభించింది అంటూ ఆ టీవీ ఛానెల్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

Actress Priya : నటి ప్రియ
బుల్లితెర అయినా, వెండి తెరపైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియ (Bigg Boss contestant Priya) ఏడో కంటెస్టంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

Model Jessie: మోడల్ జెస్సీ
మోడల్ జేసీ (Bigg Boss contestant Jessie) బిగ్ బాస్ హౌజ్‌లో 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. 

Priyanka Singh : ప్రియాంక సింగ్ 
బిగ్ బాస్ హౌజ్‌లో 9వ కంటెస్టంట్ ఎవరో కాదు.. పురుషుడిగా పుట్టి, స్త్రీగా తన జండర్‌ని మార్చుకున్న నటుడు ప్రియాంక సింగ్ (Bigg Boss contestant Priyanka Singh). ఐడెంటిటీ కోసం, అస్తిత్వం కోసం పోరాడే వాళ్లందరికీ ప్రియాంక సింగ్ స్పూర్తి అంటూ నాగ్ అభినందించాడు.

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జశ్వంత్
బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ (Bigg Boss contestant Shanmukh Jaswanth). షణ్ముఖ్ జశ్వంత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలతో ఇప్పటికే ఎంతో మంది ఆడియెన్స్‌కి చేరువైన షణ్ముఖ్.. బిగ్ బాస్ స్టేజీపై డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు.

Hamida: హమిదా
బిగ్ బాస్ హౌజ్‌లో 11వ కంటెస్టంట్‌గా హమిదా (Bigg Boss contestant Hamida) ఎంట్రీ ఇచ్చింది. సాఫ్ట్ హార్ట్, హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషిగా హమిదా తనను తాను పరిచయం చేసుకుంది.

Nataraj: నటరాజ్
(Bigg Boss contestant choreographer Nataraj) బిగ్ బాస్ హౌజ్‌లో 12వ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఫేమస్ కొరియోగ్రాఫర్స్‌లో ఒకరైన నటరాజ్ (Bigg Boss contestant choreographer Nataraj) బిగ్ బాస్ హౌజ్‌లో 12వ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. 

Sarayu: సరయు 
సోషల్ మీడియా సెన్సేషన్ సరయు (Bigg Boss contestant Sarayu) బిగ్ బాస్ హౌజ్‌లో 13వ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Vishwa : విశ్వ 
టీవీ సీరియల్స్‌తలో ఫేమస్ అయిన నటుడు విశ్వ (Bigg Boss contestant Vishwa) బిగ్ బాస్ హౌజ్‌లో 14వ కంటెస్టంట్‌గా వచ్చాడు.

Uma Devi : ఉమా దేవి 
సినిమాలు, సీరియల్స్‌తో తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితురాలైన ఉమా దేవి (Bigg Boss contestant Uma Devi) 15వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. 

Maanas: మానస్ 
బిగ్ బాస్ హౌజ్‌లోకి 16వ కంటెస్టెంట్‌గా వచ్చిన మానస్ (Bigg Boss contestant Maanas) బిగ్ బాస్ వేదికపై పవన్ కళ్యాణ్ సాంగ్స్‌కి స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.

RJ Kajal : ఆర్జే కాజల్ 
17వ కంటెస్టంట్‌గా ఆర్జే కాజల్ (Bigg Boss contestant RJ Kajal) బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎఫ్ఎం రేడియో వినే శ్రోతలందరికీ ఆర్జే కాజల్ సుపరిచితమే.  

Swetaa varma : శ్వేతా వర్మ
బాహుబలి సినిమాలో ధీవర సాంగ్‌ బ్యాగ్రౌండ్లో ప్లే అవుతుండగా.. వేదికపై స్టెప్పులేస్తూ 18వ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా వర్మ. బిగ్ బాస్ హౌజ్‌లో తోటి టీమ్మేట్స్ అందరినీ అభినందిస్తూ ట్రూ దివగా కనిపించిన శ్వేతా వర్మ (Bigg Boss contestant Swetaa varma) బిగ్ బాస్ తెలుగు ఆడియెన్స్‌ని ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే మరి.

Anchor Ravi : యాంకర్ రవి
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అస్సలు పరిచయమే అక్కర్లేని ఫేమస్ యాంకర్ రవి (Bigg Boss contestant Anchor Ravi) బిగ్ బాస్ హౌజ్‌లోకి 19వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. 

 

Trending News