టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఈ క్రమంలో తమ హీరోకి ఆర్ఆర్ఆర్ యూనిట్ ఓ వీడియోతో బర్త్ డే కానుక అందించింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.  బర్త్ డే బాయ్ Ram charan అరుదైన ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్ అల్లూరిగా కనిపించేందుకు ఎంతగా శ్రమించారో వీడియో చూస్తే తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు పాత్రను కొమురం భీమ్ ఎన్టీఆర్ రివీల్ చేశారు. వాడు కనబడితే నిప్పు కణం నిలబడ్డట్టు ఉంటది. కలవడితే ఏగుసుక్క ఎగబడినట్టుంటది. ఎదురుపడితే చావుకైనా చమటధార కడతది. ప్రాణమైనా బంధుకైనా వాడికి బాంచన్ అయితది. ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి. నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామరాజు..  RRR ఫ్యాన్స్‌కు ఉగాది కానుక.. రౌద్రం.. రుధిరం.. రణం



ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లోగోను మోషన్ పోస్టర్‌తో ఉగాది కానుకగా విడుదల చేశారు. రామ్ చరణ్ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్‌లు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో జతకట్టిన విషయం తెలిసిందే.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone 


ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos