Nisha Dubey: ఆ కేంద్ర మంత్రిపై మనసు పారేసుకున్న నటి.. ఆయనంటే క్రష్ అంటూ ఇన్ స్టాలో పోస్టులు..
Nisha Dubey: భోజ్‌పురి నటి నిషా దూబే ఇన్ స్టా వేదికగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఒక కేంద్ర మంత్రి అంటే తనకు ఎంతో ఇష్టమంటూ చెప్పింది. అంతటితో ఆగకుండా వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
bhojpuri actress nisha dubey love proposal: కేంద్రంలో ఇటీవల మోదీ 3.0 ప్రమాణ స్వీకార కార్యక్రమం పండుగలా సాగింది. ఈ కార్యక్రమానికి మన దేశంతో పాటు, విదేశాల నుంచి కూడా వీఐపీలు హజరయ్యారు. దాదాపు పదివేల మంది వరకు కూడా అతిథులు ఈ వేడుకకు హజరయ్యారు. మోదీతోపాటు మరో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీచేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండగా.. మోదీ కేబినెట్ లో.. కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్‌కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సినిమాలతో పాటు, ఇటు రాజకీయాల్లోను ట్రెండ్ సెట్టర్ గా మారారు.
ఇటీవల ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఆయన అందిరిలో స్పెషల్ గా కన్పించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు ఇటీవల అమ్మాయిలు పడిచస్తున్నారంట. ఆయనకు సోషల్ మీడియాలో బోలేడు లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయంట. ఈ క్రమంలో తాజాగా.. భోజ్ పురి నటి నిషా దూబే సంచలన విషయాన్ని బైటపెట్టారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అంటే తనకు క్రష్ అని.. ఆయనను లవ్ చేస్తున్నట్లు ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. ఇప్పటికే ఆయనంటే అనేక మంది అమ్మాయిలు పడిచస్తున్నరంట. ఇక తాజాగా, ఆ జాబితాలో..నిషా దూబే కూడా చేరిపోయారు.
ఈ నేపథ్యంలో.. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రేమిస్తున్నానంటూ నిషా దూబే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఇక.. నిషా దూబే కన్నాకూడా చిరాగ్ 16 ఏళ్లు పెద్దవాడని తెలుస్తోంది. నిషాకు వయసు 25 ఏళ్లు కాగా.. చిరాగ్ పాశ్వాన్ వయసు 41 ఏళ్లు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రమంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో క్లిప్‌ను నిషా దూబే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి, ఆయనంటే తనకు క్రష్ అంటూ తెల్చి చెప్పింది. నిత్యం నవ్వుతూ ఉండే చిరాగ్ పాశ్వాన్ అమాయకత్వపు ముఖం చేస్తే.. ఎవరైనా ఆయనంటే మనసు పారేసుకుంటారని.. అనే క్యాప్షన్ ఆ వీడియోకు జతపర్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి 6.14 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో చిరాగ్ పాశ్వాన్ విజయం సాధించారు. తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా చిరాగ్ పాశ్వాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.