Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..

Uttar pradesh: సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. వెంటనే అక్కడున్న  మత్స్యకారుడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లను కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 16, 2024, 01:11 PM IST
  • నదిలో దూకిన ప్రేమజంట..
  • మత్స్యకారుడిపై నెటిజన్ల ప్రశంసలు..
Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్..

Lovers jumping into river in uttar pradesh: సమాజంలో చాలా మంది ఒత్తిడిని ఏమాత్రం తట్టుకొలేని విధంగా ఉంటున్నారు. ప్రతి చిన్నవిషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించి, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాబ్  రాలేదని, ఎగ్జామ్ లలో ఫెయిన్ అయ్యామని చాలా మంది సూసైడ్ లు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రేమలో ఫెయిల్ అయ్యామని, నచ్చిన అమ్మాయి దొరకలేదని కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువత ఎక్కువగా ప్రేమ వివాహలు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  కొందరు ఇంట్లో వారిని ఒప్పించి, పెళ్లి చేసుకుంటున్నారు. ఒక వేళ.. తమ ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే.. బైటకు వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

 

మరికొందరు మాత్రం.. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యలు సైతం చేసుకుంటారు. ఈ క్రమంలో.. ప్రేమ వ్యవహరాల్లో చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రేమ జంట తమ ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని నదిలో దూరి ఆత్మహత్య చేసుకొవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి మత్స్యకారుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్‌ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి సూసైడ్ చేసుకున్నారు. వీరిని అక్కడే చేపలు పడుతున్న కొందరు మత్స్యకారులు గమనించారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి.. నీళ్లలోకి దూకారు. ప్రేమ జంటను జాగ్రత్తగా బైటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో యువకుడికి.. మాత్రం ఒక మత్స్యకారుడు చుక్కలు చూపించాడు. అతని చోక్కాపట్టుకుని బైటకు తీసుకొని వచ్చాడు.  అంతేకాకుండా.. అతడి చెంప పగలకొట్టాడు. ఇలాంటి పనికి మాలిన పనులు చేయడమేంటని వార్నింగ్ ఇచ్చాడు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

లైఫ్ లో గెలిచి సాధించాలికానీ.. చనిపోతే ఏమోస్తుందంటూ కూడా వారిపై మండిపడ్డాడు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు  మత్స్యకారుడు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే విధంగా.. వారికి మంచిగా బుద్ధి చెప్పారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి నిండు ప్రాణాలు కాపాడరంటూ కూడా.. మత్స్యకారుడు చేసిన పనికి శభాష్.. అంటూ పొడుతున్నారు. ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News