Bhola Shankar: భోళా శంకర్ పెద్ద రాడ్డు.. టీమిండియాదే వరల్డ్ కప్.. ఇదేక్కడి సెంటిమెంట్ మావా బ్రో..!
Bhola shankar Movie Trolls: భోళా శంకర్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో నెట్టింట భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ మెహర్ రమేశ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకువచ్చి టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.
Bhola Shankar Movie Trolls: మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భోళా శంకర్. ఆగస్టు 11న బాక్సాఫీసు ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. 2015లో తమిళం రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన వేదాళం చిత్రానికి రీమేక్‌గా భోళా శంకర్‌ను రూపొందించారు. స్టోరీ ఔట్ డేటేడ్ కాగా.. మెహర్ రమేష్ టేకింగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నా.. కథలో పసలేకపోవడంతో అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది.
ఈ సినిమాను చూసి చిరంజీవి ఫ్యాన్సే ఎందుకు తీశారంటూ తలలు పట్టుకుంటున్నారు. పదేళ్ల తరువాత దర్శకత్వం వహించినా.. మెహర్ రమేష్ తీరుమారలేదంటూ తిట్టుకుంటున్నారు. అయితే కొందరు అభిమానులు మాత్రం భోళా శంకర్ ఫ్లాప్ కావడం ఓ రకంగా మంచిదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు ఓ సెంటిమెంట్‌ను కూడా కారణంగా చూపిస్తున్నారు.
ఈసారి ప్రపంచకప్ భారత్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా పోయి ఫ్యాన్స్ బాధపడుతుంటే.. ఇదేం సెంటిమెంట్‌ను క్రికెట్ అభిమానులు బయటకు తీశారు. ఎన్టీఆర్-మెహర్ రమేశ్ కాంబోలో 2011లో శక్తి సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. అదే ఏడాది జరిగిన ప్రపంచకప్‌ను ధోనీ సేన సొంతం చేసుకుంది.
2013లో మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వెంకటేశ్ హీరోగా ‘షాడో’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇది కూడా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అదే సంవత్సరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచ కప్‌కు ముందు మెహర్ రమేశ్ భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం టీమిండియా విశ్వ విజేతగా నిలుస్తుందని జోస్యం చెబుతున్నారు. మెహర్ అన్న ఫ్లాప్ సెంటిమెంట్ రోహిత్ సేనకు కలిసివస్తుందని అంటున్నారు.
ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా తీసి ఇండియాకి ఐసీసీ ట్రోఫీ ఇవ్వటానికి వచ్చిన గొప్ప మనిషి మెహర్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి మరి. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
Also Read: Telangana Politics: బీజేపీకి బిక్ షాక్.. కీలక నేత గుడ్‌బై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి