Mohan Babu: మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కొట్టుకున్న బౌన్సర్లు..!
Manchu Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం మంచు ఫ్యామిలీలో గొడవలు. ముఖ్యంగా మంచు మనోజ్ తాజాగా తన తండ్రి అనుచరులైన పదిమంది పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం.
Mohan Babu House :గత కొన్ని రోజులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు అనూహ్యంగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఒకవైపు మంచు విష్ణు దుబాయ్ లో ఉండగా.. ఇక్కడ మోహన్ బాబు ,మనోజ్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తి పంపకాల విషయంలోనే మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు జరిగాయని , ఆ సమయంలో మోహన్ బాబు అనుచరుడైన వినయ్ అనే వ్యక్తి రౌడీ మూకతో కలిసి తనపై దాడి చేశాడని మనోజ్ డయల్ 100 కి ఫోన్ చేసి తెలిపారు.
అయితే ఇందులో నిజం లేదని మోహన్ బాబు టీం వెల్లడించినప్పటికీ.. మనోజ్ తన భార్య సహాయంతో హాస్పిటల్ కి వెళ్లడం, అందుకు సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. మెడకి పట్టీ, నడవలేని స్థితిలో భార్యా స్నేహితుల సహాయంతో హాస్పిటల్ కి వెళ్లారు. అనంతరం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో తన కుటుంబ సభ్యులపై కాకుండా తనను గుర్తుతెలియని పదిమంది వ్యక్తులు దాడి చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మంచు మనోజ్.
మరొకవైపు మోహన్ బాబు తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ముప్పు పొంచి ఉందని, దయచేసి కాపాడాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా మరొకవైపు మంచు విష్ణు దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటివద్ద మంచు మనోజ్ కి సంబంధించి 30 మంది బౌన్సర్లు, మంచు విష్ణు కి సంబంధించి 40 మంది బౌన్సర్లు చేరుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు బౌన్సర్లు మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా ..మంచు మనోజ్ బౌన్సర్లు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి బౌన్సర్ల మధ్య కాస్త వాగ్వాదం జరగగా.. వెంటనే పహాడీ షరీఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.