Mohan Babu Audio File: గత రెండు రోజులుగా సినీ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు మంటలు రేపుతున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా మనోజ్,  మోహన్ బాబు పరస్పరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో అసలు వివాదం తెరపైకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా తన తండ్రి అనుచరులు తనతో దాడి చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మంచు మనోజ్. అంతేకాదు తన ఇంటి దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని కూడా తన అన్నయ్య మంచి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ ధ్వంసం చేశాడని, తనకు తన కుటుంబం నుంచి రక్షణ కావాలని కోరుతూ పలువురు అధికారులను మంచు మనోజ్, మౌనిక దంపతులు కలుస్తున్నారు. 


ఈ నేపథ్యంలోని ఇంటికి వస్తుండగా మోహన్ బాబు సిబ్బంది మనోజ్ దంపతులను ఇంటి లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో గేట్లు పగల కట్టుకొని మనోజ్ లోపలికి వెళ్లిపోయారు. ఇక అక్కడ వాతావరణం చాలా వేడెక్కించింది. చాలామంది కొట్టుకున్నారు కూడా. 


ఈ నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అందులో మోహన్ బాబు మాట్లాడుతూ..మనోజ్ నేను నిన్ను చిన్నప్పటినుంచి చాలా అల్లరి ముద్దుగా పెంచాను. నేను నీ చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టాను. కానీ నువ్వు నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు. తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు.కొన్ని కారణాలవల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. అది నిజమే కానీ ప్రతి ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి కదా.కానీ నువ్వు నా పైన కోపంతో ఇంట్లో ఉన్న అందరిని కూడా కొడుతున్నావు. బ్రతుకుతెరువు కోసం వచ్చిన పని వాళ్ళను కొట్టడం మహా పాపం. నీ దాడిలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. 


 



విద్యాసంస్థల్లో ప్రతీది కూడా లీగల్ గానే జరుగుతోంది. తప్పులు ఎక్కడ జరగలేదు. కానీ నువ్వు అన్నతో పాటు వినయ్ ని కూడా కొట్టడానికి వచ్చావు . సొంత నీ రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యని కూడా చంపుతానని బెదిరిస్తున్నావు అసలు నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు . ఇది మొత్తం నా కష్టార్జితంతోనే కట్టుకున్న ఇల్లు. కానీ నువ్వు మాత్రం రోడ్డుకి ఎక్కి  నా పరువు తీసావు. అసలు ముగ్గురికి సమానంగా ఆస్తి రాయాలా? వద్దా? అనేది కూడా నా ఇష్టం. 


ఇక నేను నా ఆస్తులను పిల్లలకు ఇస్తానా అన్నది కూడా నా ఇష్టమే. మా నాన్న నాకు ఏమీ ఆస్తులు ఇవ్వలేదు. అయినా సరే నేను సంపాదించుకున్నాను. కానీ నువ్వే నా ఇంట్లోకి అక్రమంగా చొరబడి నా మనుషులను కొడుతున్నావ్. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరుతున్నావ్. ఇక నీ కూతుర్ని వచ్చి తీసుకెళ్ళు. నా దగ్గర వదిలిపెట్టినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక జరిగిన ఈ సంఘటనతో మీ అమ్మ ప్రస్తుతం ఆస్పత్రిలో చేరింది . ఇక పోలీసుల సమక్షంలోనే నేను నీ కూతురిని అప్పగిస్తాను.. అంటూ మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు.


Read more: Manchu mohan Vs Manchu Manoj: మోహన్ బాబును కొట్టిన మంచు మనోజ్..?.. పనిమనిషి బైటపెట్టిన సంచలన నిజాలు ఇవే.. వీడియో వైరల్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.