Eagle: థియేటర్ వర్షన్ కి ఓటీటీ వర్షన్ కి మధ్య భారీ మార్పు.. ఈగల్ ప్లాన్ ఏమిటి?
Eagle OTT: భారీ అంచనాల మధ్య విడుదలై పర్వాలేదు అనిపించుకున్న రవితేజ చిత్రం ఈగల్. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో కొత్త కన్ఫ్యూషన్ కి తేరలేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ పై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.
Ravi Teja: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఈగల్. ఫిబ్రవరి 9న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది అని ధీమాగా ఉన్న చిత్రం కాస్త బోల్తా పడింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ లో సందడి చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన డైలాగ్స్ ను మణి బాబు అందించారు.
కాగా ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే ఈ చిత్రం, అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు ఈటీవీ విన్ యాప్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ థియరిటికల్ వెర్షన్ కు ఓటీటీ కు చాలా తేడా ఉన్నట్టు ప్రేక్షకులు గమనించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లో ఈ సినిమా ఎండింగ్ లో ఈగల్ 2 యుద్ధకాండ అనే టైటిల్ తో ముగించారు. అయితే ఓటీటీ లో మాత్రం కేవలం పార్ట్ 2 ఉంది అన్న హింట్ ఇచ్చారే తప్ప యుద్దకాండ అనే పదాన్ని తప్పించేశారు.
దీంతో ప్రస్తుతం యుద్ధకాండ అనే పదాన్ని ఎందుకు తప్పించారు అనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది కానీ అప్పట్లో థియేటర్ల విషయంలో జరిగిన గందరగోళం కారణంగా ఫిబ్రవరి 9న సోలోగా విడుదలయింది. అయినా కానీ కలెక్షన్స్ పరంగా మూవీ డల్ గానే పర్ఫామ్ చేసింది. అయితే చిత్ర బృందం మాత్రం కలెక్షన్స్ తో సంబంధం లేకుండా తాము సేఫ్ అని ప్రకటించారు. మరోపక్క ప్రస్తుతం రవితేజ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చే మూవీ ఒక్కటైనా పడాలి అని మాస్ మహారాజ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో మొత్తానికి ఈగల్ సినిమాకి రెండో భాగం ఉంటుంది అన్న విషయం ఓటీటీ లో కూడా స్పష్టం అయింది. కాకపోతే మూవీ టైటిల్ మాత్రం యుద్ధకాండ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తరకెక్కుతున్న ఈ మూవీ ను కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత ఈగల్ సీక్వెల్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!
Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook