Anupama Parameswaran: అనుపమకి అసలైన పరీక్ష.. సినిమా తేడా కొడితే ఇంక అంతే సంగతి!
Tillu Sqaure: చాలా వరకు పద్ధతి గల పాత్రలను మాత్రమే చేసే అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా కోసం బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. మరి ఈ సినిమా విషయంలో అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని తెలియాల్సి ఉంది.
Anupama Parameswaran Bold Scenes: ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి అనుపమ పరమేశ్వరన్ చాలావరకు బోల్డ్ సన్నివేశాలకి దూరంగా ఉంటూ వచ్చింది. ఎప్పుడూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో మాత్రమే కనిపించి అందరినీ అలరించింది. నటనకి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి హిట్ సినిమాలను కూడా అందుకుంది.
ఈ మధ్యనే విడుదలైన కార్తికేయ 2 సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుంది ఈ భామ. కానీ తాజాగా ఈమె నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా విషయంలో మాత్రం అనుపమ వేరొక నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటిదాకా విడుదలైన సినిమా టీజర్లు ట్రైలర్లు పోస్టర్లతో సహా అనుపమ పరమేశ్వరన్ హాట్ అవతారంలోనే కనిపించింది.
ఈ సినిమాలో ఆమె హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించింది. గ్లామర్ టచ్ ఎక్కువగా ఉన్న ఈ పాత్రలో అనుపమ లిప్ లాక్ సన్నివేశాలను కూడా చేసింది. దీంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. సడన్ గా ఇలాంటి బోల్డ్ పాత్ర ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి అని పలు ఇంటర్వ్యూలలో అడగగా ఈ కేరళ కుట్టి చాలా సింపుల్ గా రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టేసింది అని తేల్చి చెప్పింది.
మరి ఈ సినిమాలో ఈమె పాత్రకి నటన కి స్కోప్ ఉంటుందా లేదా అని చూడల్సి ఉంది. ఈ సినిమా కోసం బోల్డ్ అవతారంలోకి మారిన అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న నిర్ణయం తన కెరియర్ కి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అని ఈ వారం తెలిసిపోతుంది.
ఈ శుక్రవారం మార్చ్ 29న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అసలే బాక్స్ ఆఫీస్ డల్ గా ఉన్న సమయం కాబట్టి సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు భారీగానే వస్తాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య ఆ వరుస ఫ్లాప్ సినిమాలు అందుకుంటుంది.
దీంతో టిల్లు స్క్వేర్ సినిమా హిట్ అవ్వడం ఆమె కెరియర్ కు కూడా చాలా కీలకంగా మారబోతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఆక్టోపస్ లో కీలక పాత్ర చేసింది కానీ ఇంకా దాని తాలూకు డీటెయిల్స్ బయటికి రాలేదు. మలయాళం లో జెఎస్కె సినిమా కూడా ఇంకా నిర్మాణంలోనే ఉంది. టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అయితే కచ్చితంగా అనుపమ కి స్టార్ హీరోల తో నటించే అవకాశం వస్తుంది. మరి ఈ సినిమా ఆమె కెరియర్ ను ఏ విధంగా మారుస్తుందో చూడాలి.
Also Read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్.. టీజర్‌లో 'గాజు గ్లాస్' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!
Also read: CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook