Balakrishna: 20 ఏళ్ల తర్వాత రీమేక్ కు రెడీ అవుతున్న బాలయ్య.. బ్లాక్ బస్టర్ మలయాళీ సినిమాతో..!
Balakrishna Upcoming Movies:టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు.. తీయడం కొత్త విషయం ఏమీ కాదు. ఎందరో స్టార్ హీరోలు మిగిలిన భాషల్లో సూపర్ డూపర్ హిట్.. అయిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. ఇప్పుడు బాలయ్య కూడా మరొక రీమేక్ సినిమాకి సిద్ధమవుతున్నట్లు టాక్..
Aavesham movie remake: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీమేక్స్ పర్వం కొత్తవి కాదు. స్టార్ హీరోలు అందరూ రీమేక్స్ సినిమాలు చేసినవారే. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం.. ఈ విషయంలో కాస్త డిఫరెంట్ గా ఉంటారు. మామూలుగా వేరే భాష చిత్రాలను రీమేక్ చేయడం పట్ల బాలకృష్ణ.. అంతగా ఆసక్తి చూపరు అని ఇండస్ట్రీలో టాక్. గత 20 ఏళ్ల వ్యవధిలో ఇప్పటివరకు బాలకృష్ణ కేవలం ఒక్క రీమిక్స్ సినిమా చేశారు. దీన్ని బట్టి ఆయనకు రీమేక్ సినిమాలలు అంతగా సెట్ కావు అన్న విషయం అర్థం అయితే ఇప్పుడు మరొకసారి బాలకృష్ణ రీమిక్స్ సినిమాలకు సిద్ధమవుతున్నాడట.
2004లో విడుదలైన లక్ష్మీనరసింహ సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయినా ‘సామి’ చిత్రానికి విమేక్ అన్న విషయం అందరికీ. ఆ రీమేక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బాలయ్య మళ్ళీ తిరిగి రీమేక్ సినిమాలో జోలికి వెళ్లలేదు. అయితే హాలీవుడ్ పాత క్లాసిక్ మూవీస్ అయిన ‘లవకుశ’ను ‘శ్రీరామరాజ్యం’పేరుతో బాలయ్య రీమేక్ చేశారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు మరొకసారి రీమేక్ చిత్రాన్ని ట్రై చేయబోతున్నాడు బాలకృష్ణ.
మలయాళం లో సూపర్ డూపర్ హిట్ సాధించిన మూవీని బాలయ్యతో తిరిగి తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలో హీరోగా నటించిన పుష్ప చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమైన ఫాహద్ ఫాజిల్. ఇందులో ఫాహద్ క్యారెక్టర్జేషన్ చాలా క్రేజీగా ఉంటుంది. నిజంగా ఈ మూవీకి అతని క్యారెక్టర్, పర్ఫామెన్స్ పెద్ద ప్లస్ పాయింట్ . బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో మలయాళం తోపాటు హిందీ ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.అయితే ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నారు కాబట్టి తెలుగు వర్షన్ విడుదల చేసి ఉండకపోవచ్చు.
మామూలుగా అయితే ఫాహద్ స్థానంలో మరొక నటుడిని ఊహించుకోవడం కష్టమే. కానీ నటించేది బాలయ్య కాబట్టి ఆ పాత్ర కష్టం కాదు . పైగా జనరల్‌గానే బాలయ్య కి ఆవేశం ఎక్కువ.. కాబట్టి ఈ మూవీ క్యారెక్టర్ బాలయ్యకు బాగా సెట్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన రీమేకింగ్ రైట్స్ కోసం మైత్రి మూవీ సంస్థ ప్రయత్నిస్తోందని టాక్. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ బాలయ్య ఈ మూవీ చేస్తే అంతకంటే క్రేజీ మూవీ మరొకటి ఉండదు అనడంలో సందేహం లేదు.
Also Read: Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..
Also Read: Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter