బిగ్ బాస్ 4 షోలో అందరిని తన మాటలతో మెప్పించి ఆరోగ్య సమస్యలతో బయటకు వచ్చి ప్రస్తుతం పల్లె ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, తన స్నేహితులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్న గంగవ్వ మరోసారి ఆ టీవీ ఛానెల్లో ప్రత్యక్షమైంది. అలాగే ఎప్పుడు చూసినా నవ్వుతూ కనిపించే బిగ్ బాస్ మరో కంటెస్టంట్ జోర్దార్ సుజాత కూడా అదే ఛానెల్లో మరోసారి కనిపించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈసారి బిగ్ బాస్ కోసం కాదులెండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకి ఏంటి ఆ షో అనుకుంటున్నారా ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు పెద్దలు కానీ, ఆ ఆరోగ్యాన్ని మరిచి ఉద్యోగ ఒత్తిళ్లలో పడుతున్నారు ఈ కాలం యువత. అలాగే గంటల తరబడి కదలకుండా కూర్చోని కనీస వ్యాయామం కూడా లేక ఊబకాయం లాంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా వ్యాయామం చేయాలి అంటూ ఆ టీవి ఛానెల్లో ఉదయాన్నే వచ్చే 'ఆహారం ఆరోగ్యం' ప్రోగ్రాంలో జోర్దార్ సుజాత యాంకర్‌గా ( Bigg Boss 4 contestant Jordar Sujatha ), అలాగే అదే ప్రోగ్రాంలో గంగవ్వ రోజుకో ఆరోగ్య చిట్కా చెప్పి అది ఎలా చేయాలో కూడా చేసి చూపించే బామ్మగా దర్శనమివ్వనుంది. 


Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !


మొత్తానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టంట్స్ గంగవ్వ ( Bigg Boss 4 contestant Gangavva ), జోర్దార్ సుజాత ఇలా మళ్లీ ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యారు. బిగ్ బాస్ షో చేయడానికి ముందు తాము చేస్తోన్న పనులు వదిలేసుకుని వచ్చినందుకు వాళ్లకు ఇలా ఫలితం లభించింది అనుకుంటున్నారు నెటిజెన్స్.


Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి