Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !

బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో 11వ వారం ఎలిమినేషన్ ప్రాసెస్‌కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈ రోజు జరగనుండగా ఎప్పటిలాగే లీకు వీరులు ఈ వారం నామినేట్ అయిన అభ్యర్థుల జాబితాను లీక్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది.

  • Nov 16, 2020, 18:59 PM IST

ఈ వారం నామినేషన్స్ సందర్భంగా అఖిల్, అభిజీత్‌ల మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి రావడాన్ని మేక మటన్ షాపులోకి పోయి రావడంగా అభిజీత్ అభివర్ణించగా.. మేక కాదు పులిని అందుకే బయటికొచ్చి కెప్టేన్ అయ్యానంటూ అఖిల్ డైలాగ్ కొట్టాడు. అఖిల్ పంచ్‌కి అభిజీత్ స్పందిస్తూ.. మేక ఎప్పుడూ పులి కాదు.. బలైద్ది అంటూ అఖిల్‌కి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. అలా బిగ్ బాస్ హౌజ్‌లో ఈ వారం నామినేషన్స్ మరోసారి వాతావరణాన్ని హీటెక్కించింది. ( Image courtesy : video grabs from Twitter@Starmaa )

1 /6

బిగ్ బాస్ హౌజ్‌లో 10వ వారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. మెహబూబ్ హౌజ్ నుండి వెళ్తుంటే కంటెస్టెంట్స్ అందరూ ఏమోషనల్ అయ్యారు. అందులోను బిగ్ బాస్ హౌజ్‌లో సోహెల్‌కి, మెహబూబ్‌కి మంచి అటాచ్‌మెంట్ ఉండడంతో సోహెల్ బాగా ఏమోషనల్‌కి గురయ్యాడు. అతి కష్టం మీద మొహబూబ్ సోహెల్‌ని ఓదారుస్తూ.. సోహెల్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు మెహబూబ్ కూడా ఉన్నట్టే అని ధైర్యం చెప్పాడు. ( Image courtesy : video grabs from Twitter@Starmaa )

2 /6

బిగ్ బాస్ హౌజ్‌లో 11వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులకు హార్ట్ సింబల్ మెడలో వేసి.. వారి చేతులకు చాకులను ఇచ్చారు. తమకు నచ్చని వ్యక్తి పేరు చెప్పి సరైన కారణాలను వెల్లడిస్తూ ఆ కంటెస్టెంట్ మెడలో ఉన్న హార్ట్‌పై చాకును గుచ్చి నామినేట్ చేయాలి అనేది బిగ్ బాస్ ఆర్డర్. ( Image courtesy : video grabs from Twitter@Starmaa ).

3 /6

బిగ్ బాస్ ఆర్డర్ ప్రకారం తమకు నచ్చని వ్యక్తి మెడలో ఉన్న హార్ట్‌పై కత్తితో గుచ్చి నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పే క్రమంలో.. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ( Image courtesy : video grabs from Twitter@Starmaa )

4 /6

నామినేషన్ సందర్భంగా లాస్యను నామినేట్ చేసిన అరియానా గ్లోరి.. అందుకు తనకున్న కారణం ఏంటో చెప్పింది. అరియానా అసలు పోటీనే కాదు అని లాస్య గతంలో వ్యాఖ్యానించింది అని అరియానా చెప్పుకు రాగా.. అవును ఇప్పటికీ తనది అదే అభిప్రాయం అని లాస్య బదులిచ్చింది.  మరోవైపు అఖిల్ సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన తరువాత కెప్టెన్ అవడంతో ఈ వారం ఇమ్యూనిటి పొందాడు. ఇక అవినాష్ కూడా నామినేషన్ నుండి తప్పించుకున్నట్లు సమాచారం. ( Image courtesy : video grabs from Twitter@Starmaa )

5 /6

ఇదిలావుంటే, లీకువీరుల కథనం ప్రకారం ఈ వారం నామినేషన్‌లో యాంకర్ అరియానా గ్లోరి, లాస్య, అభిజిత్, సోహెల్, మోనల్ గజ్జర్, దేత్తడి హారిక ఉన్నట్లు తెలుస్తోంది. ( Image courtesy : video grabs from Twitter@Starmaa )

6 /6